NRI-NRT

ఘనంగా ముగిసిన 18వ ఆటా మహాసభలు

ఘనంగా ముగిసిన 18వ ఆటా మహాసభలు

జూన్ 7 నుండి 9 వరకు అట్లాంటాలో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ ఘనంగా ముగిసింది. మూడు రోజులలో దాదాపు 20 వేల మంది హాజరయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆటా మహా సభలు అట్లాంటాలో జరగడం ఇది మూడోసారి. అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ నాయకత్వంలో ఏర్పాట్లను సమన్వయపరిచారు. వివిధ రంగాలకు చెందిన వారికి ఆటా పురస్కారాలు ప్రదానం చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనూప్ రూబెన్స్ బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ అలరించింది.

తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యాన గురు దాజి, సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా, ఏ యెన్ ఆదిత్య, తనికెళ్ళ భరణి, సత్య మాస్టర్, అంకిత జాదవ్, అంగనా, శ్రీముఖి, రవళి, జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి విచ్చేశారు. వీరితో పాటు నాయకులు, సినీ, బుల్లితెర నటులు, టెక్నిషియన్స్, ఆధ్యాత్మిక గురువులు, సాహితీవేత్తలు, శాస్తవేత్తలు, జబర్దస్త్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. గురువులు దాజి, రాజేశ్వరరావు టెక్మెల్ లకు ఆటా జీవిత సాఫల్య అవార్డు ఇచ్చారు.

శనివారం పండితుల వేదమంత్రాలతో ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, ఇంతకు ముందు ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీలు జ్యోతి ప్రజ్వలన చేశారు. అమెరికా-భారత జాతీయ గీతాలు ఆలాపన అనంతరం మధు బొమ్మినేని మాట్లాడారు. నవత, యువత, భవిత తమ లక్ష్యాలనీ, వీటికి ఆటా అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. కన్వీనర్ కిరన్ పాశం కన్వెన్షన్ వల్ల ప్రయోజనాలు వివరించారు.

ఆదివారం భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించారు. స్పిరిట్యుయల్ కమిటీ చైర్ డాక్టర్ ప్రసాద్ గరిమెళ్ళ, ఎండోమెంట్స్ సెక్రటరీ హనుమంత రావు, భద్రాద్రి నుంచి విచ్చేసిన పండితులు రామ స్వరూప్, విష్ణు, భాస్కర శర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

ఏ ఐ సెమినార్, సెలబ్రిటీలతో క్యూ & ఏ, వివిధ విషయాలపై డిబేట్స్, గేమ్స్ ఇలా చాలా కార్యక్రమాలు ఉపయోగకరంగా, వినోదాత్మకంగా సాగాయి. బిజినెస్ ఫోరమ్ లో రాష్ట్ర మంత్రులు, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు, తెలంగాణ ఐటీ అడ్వైజర్ రవి తంగిరాల తదితరులు పాల్గొనగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా మోడరేటర్ గా వ్యవహరించారు. సురవరం ప్రతాప రెడ్డి వేదికగా సాహిత్య ఫోరమ్ లో కథా సాహిత్యం, సమకాలీన నవల, పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. అష్టావధానం రకరకాల చిక్కుముడులతో రసవత్తరంగా సాగింది. తనికెళ్ళ భరణి, గంగాధర శాస్త్రి ప్రవచనాలు అద్భుతంగా సాగాయి. కళాత్మకమైన ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ లో ఎంతో మంది ఆర్టిస్టులు వేసిన పలు కళాఖండాలు ఆకర్షణీయంగా నిలిచాయి.

అడ్వైజరీ కమిటీ గౌతమ్ గోలి, కరుణాకర్ ఆసిరెడ్డి, మహేందర్ ముసుకు, కే కే రెడ్డి, నరేందర్ చేమరాల, వెంకట్ వీరనేని దిక్సూచిగా నిలబడ్డారు. మీడియా కమిటీ ఛైర్ సాయిరామ్ కారుమంచి వేడుకలకు ప్రాచుర్యం కల్పించడంలో సమన్వయపరిచారు. ఇంత పెద్ద కన్వెన్షన్ చేయడం అంత తేలిక కాదనీ, ఈ ప్రభను ముందుకు తీసుకువెళ్తామని ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా అన్నారు. కన్వీనర్ కిరణ్ పాశం ధన్యవాదాలు తెలిపారు. ప్రెసిడెంట్ మధు బొమ్మినేని వోట్ అఫ్ థ్యాంక్స్ లో భాగంగా ఈ కన్వెన్షన్ ఇంత దిగ్విజయంగా సాగడానికి కారణమైన కోర్ టీం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు అఫ్ ట్రస్టీస్, స్పాన్సర్లు, కన్వెన్షన్ కమిటీలు, మెంబర్లు, ప్రేక్షకులు, అన్ని రకాల వెండర్ల కృషిని కొనియాడి ధన్యవాదాలు తెలిపారు. థమన్ మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z