* ఒక హత్యకేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప(Darshan Thugadeepa)ను అరెస్టయ్యారు. మంగళవారం మైసూరులో ఆయనతో పాటు మరో పదిమందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
* ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును అరెస్టు చేశారు. ఛార్జిషీట్‌లో ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. మరో వైపు అడిషినల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో బుధవారం తీర్పు వెల్లడించనున్నట్టు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.
* దేశ రాజధాని దిల్లీ నుంచి టొరంటో వెళ్లే ‘ఎయిర్ కెనడా’ విమానానికి ఇటీవల బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఓ 13 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని విచారించగా.. పలు ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. తనను పట్టుకుంటారా? లేదా? అని చెక్ చేసేందుకు సరదా కోసమే దిల్లీ ఎయిర్‌పోర్ట్ (Delhi Airport)కు ఆ తప్పుడు ఈమెయిల్ పంపినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. ‘‘గతంలో ముంబయి విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఇలాంటి ఘటన గురించి బాలుడు తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే తప్పుడు బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపాలనే ఆలోచన వచ్చింది. ఇలా చేస్తే.. పోలీసులు తనను పట్టుకుంటారో? లేదో? చూడాలనుకున్నాడు. బెదిరింపునకు కొన్ని గంటల ముందే తన ఫోన్‌లో ఈమెయిల్ ఐడీ సృష్టించాడు. తన తల్లి ఫోన్ వైఫై ఉపయోగించి మెయిల్ పంపాడు. అనంతరం ఆ ఐడీని డిలీట్ చేశాడు’’ అని పోలీసులు వెల్లడించారు. భయంతో తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదని, మరుసటి రోజు బాంబు బెదిరింపు వార్తలు చూసి ఉత్సాహపడ్డానని అతడు చెప్పినట్లు తెలిపారు.
* బిహార్‌లోని ఓ జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన చైనీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్సుకు చెందిన లీ జియాకీ సరైనా పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించాడు.
* విదేశీ మహిళను ఓ నగల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు, నాణ్యమైన బంగారు నగల పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డాడు. ఈ ఘోరం రాజస్థాన్‌లో వెలుగుచూసింది. అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్‌లోని జోహ్రీ బజార్‌లోని బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్‌తో కూడిన బెండి అభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాల రూ. 6 కోట్లు వెచ్చించింది. ఏప్రిల్‌లో యూఎస్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం రూ. 300 మాత్రమేనని తెలిసి షాక్‌కు గురైంది. వెంటనే సదరు మహిళ జైపూర్‌కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది. అయితే దుకాణం యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపాడేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు. కాగా 2022లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం ₹ 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z