NRI-NRT

తెలంగాణా ప్రవాసుల కోసం ప్రత్యేక బోర్డు: అమెరికాలో మంత్రి దుద్దిళ్ల

తెలంగాణా ప్రవాసుల కోసం ప్రత్యేక బోర్డు: అమెరికాలో మంత్రి దుద్దిళ్ల

తెలంగాణాకు చెందిన ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని తెలంగాణా ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(GTA) వాషింగ్టన్ డీసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఆయన హాజరై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

ప్రవాస భారతీయులు పుట్టిన ఊరుకు మేలు చేసే విధంగా గ్రామ పురోగతిలో భాగస్వాములు కావాలన్నారు. కేరళలో ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డు విజయవంతంగా నడుస్తుందని అంతకన్నా మిన్నగా అతి త్వరలో తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లాలో త్వరలో 1000 కోట్లతో కోకకోల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. హైదరాబాద్ నగరానికి పరిమితం కాకుండా పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ విస్తరణకు తమ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(GTA) చైర్మన్ విశ్వేశ్వర్ కలవల, సురేష రెడ్డి, ట్రెజరర్ సుధీర్ ముద్దసాని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమరేంద్ర నంది, వాషింగ్టన్ డీసీ విభాగ ఉపాధ్యక్షులు కోట్య బానోత్, రాము ముండ్రాతి, ఎక్స్కూటివ్ కమిటి టీం సునీల్ కుడికాల, మధు యనగంటి తదితరులు పాల్గొన్నారు.

JygWPkb.md.jpg

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z