Movies

“రేవు” పార్టీలో దిగ్గజాల సందడి

“రేవు” పార్టీలో దిగ్గజాల సందడి

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రేవు”. ఈ చిత్రంలో గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి నిర్మిస్తున్నారు. నవీన్ పారుపల్లి సమర్పకులుగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “రేవు” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ఫ్యాషన్ షో మరియు స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో చిత్ర బృందంతో పాటు మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల, సంపత్ నంది, ఉత్తేజ్ గెస్టులుగా పాల్గొని సందడి చేశారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ.. రేవుల దగ్గర జీవనం గడిపే మత్య్సకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు వారి శ్రమను దోచుకుంటారు. చేపలను వారు చెప్పిన రేటుకే కొనాలని షరతులు విధిస్తారు. మత్స్యకారుల జీవితాల్లోని ఇలాంటి ఇబ్బందులను నేపథ్యంగా ఎంచుకుని రేవు సినిమా చేయడం మంచి ప్రయత్నం అని అన్నారు.

దర్శకుడు ఆర్జీవీ మాట్లాడుతూ.. నేను విజయవాడలో ఉన్నప్పుడు మచిలీపట్నం రేవుకు వెళ్లేవాడిని. అయితే అక్కడ మత్స్యకారుల బాధలు చూసేందుకు కాదు అక్కడ చేపలు అమ్మే వారిని చూసేందుకు. రేవు సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను చూసిన ఈ సినిమా కంటెంట్ ప్రకారం రేవు నేపథ్యంగా సాగే మత్స్యకారుల జీవితాలు, వారి లైఫ్ లో జరిగే ఈవెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారని అనుకుంటున్నాను. దర్శకుడు హరినాథ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అని ముగించారు.

హీరోయిన్ అనన్య నాగళ్ల రేవు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. సంపత్ నంది మట్లాడుతూ.. నిర్మాత డాక్టర్ మురళి గింజుపల్లి తనకు క్లాస్ మేట్ అని ఆయన నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

నటుడు ఉత్తేజ్ మట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రేక్షకులకు దీన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

నిర్మాత డాక్టర్ మురళి గింజుపల్లి మాట్లాడుతూ.. ఆర్జీవీ, మురళీమోహన్‌లు తనకు రెండు కళ్లు లాంటివారన్నారు. ఒకరు సినిమా ఇష్టానికి గురువైతే.. ఇంకొకరు వ్యాపార విస్తరణకు ప్రేరణని పేర్కొన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

ఆర్టిస్టులు: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి, తదితరులు.
సాంకేతిక నిపుణులు:
డి ఓ పి – రేవంత్ సాగర్
నేపథ్య సంగీతం- వైశాక్ మురళీధరన్
పాట- జాన్ కె జోసెఫ్
ఎడిటర్ – శివ శర్వాని
కళ- బాషా
సాహిత్యం – ఇమ్రాన్ శాస్త్రి,
నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు,
నిర్మాతలు డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి, రచయిత దర్శకుడు – హరినాథ్ పులి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z