DailyDose

డల్లాస్‌లో గోపీకృష్ణ హంతకుడి అరెస్ట్-CrimeNews-June 25 2024

డల్లాస్‌లో గోపీకృష్ణ హంతకుడి అరెస్ట్-CrimeNews-June 25 2024

* తిరుపతన్న, భుజంగరావు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా. ఇద్దరి బెయిల్‌ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న తిరుపతన్న, భుజంగరావు.

* మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్‌ గద్దె బ్రహ్మాజీపైనా విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయగ్రీవ కన్‌స్ట్రక్షన్‌ అధినేత జగదీశ్వరుడు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దీంతో ఈనెల 22న పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎంవీవీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

* అత్యాచారాన్ని అడ్డుకున్న మహిళను వృద్ధుడు హత్య చేశాడు. (Old Man Murders Woman) మృతదేహాన్ని రెండు భాగాలుగా నరికాడు. వాటిని రెండు రైళ్లలో పడేశాడు. దర్యాప్తు జరిపిన రైల్వే పోలీసులు చివరకు నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. రత్లాం జిల్లాలోని బిల్‌పాంక్ పోలీస్ స్టేషన్‌ పరిధి ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల మహిళ భర్తతో గొడవ పడింది. జూన్‌ 6న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె ఉజ్జయిని రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. మథుర వెళ్లేందుకు ఒంటరిగా వేచి ఉన్న ఆ మహిళను 60 ఏళ్ల కమలేష్ పటేల్ గమనించాడు. మాయమాటలు చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. నిద్ర మాత్రలు కలిపిన ఆహారం ఇచ్చాడు. మత్తులో ఉన్న ఆ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. కాగా, ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిన కమలేష్‌ కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికాడు. మహిళ మృతదేహం భాగాలను బ్యాగుల్లో ఉంచి ఇండోర్-నాగ్డా, ఇండోర్‌-డెహ్రాడూన్ ప్యాసింజర్ రైళ్లలో వదిలేశాడు.

* అమెరికాలోని డల్లాస్‌లో భారతీయ యువకుడిని కాల్చి చంపిన దుండగుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక దుకాంలో చోరీకి పాల్పడి, దాసరి గోపీకృష్ణను కాల్చి చంపిన కేసులో మాథిస్‌పై అభియోగాలు నమోదు చేశారు. ఇతనిపై ఇంతకుముందు కూడా హత్యా నేరం అభియోగాలున్నాయని పోలీసులు వెల్లడించారు. జూన్‌ 21న, గోపీకృష్ణ పనిచేస్తున్న స్థానిక కన్వీనియన్స్ స్టోర్‌లో దుకాణంలో చోరీకి తెగబడిన మాథిస్ కౌంటర్ వద్ద ఉన్న గోపీకృష్ణపై పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు, స్నేహితులు కాన్సులేట్‌ సహకారంతో గోపీకృష్ణ మృతదేహాన్ని బాపట్లలోని అతని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ ఎనిమిది నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. Read More – https://www.dallasnews.com/news/crime/2024/06/24/man-arrested-for-fatal-shooting-during-robbery-in-pleasant-grove/

* పోలీసుల వేధింపుల‌కు రెండు ప్రాణాలు బ‌ల‌య్యాయి. హ‌త్రాస్ పోలీసుల వేధింపుల‌తో రెండు రోజుల‌ వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు సోద‌రులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ముందుగా త‌మ్ముడు సంజ‌య్ అనే ఆత్మ‌హ‌త్య చేసుకున్న రెండు రోజుల‌కు ఆగ్రా స‌మ‌మీపంలోని ఓ గ్రామంలో చెట్టుకు ఉరేసుకొని సోద‌రుడు ప్ర‌మోద్ సింగ్ అనే వ్య‌క్తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.కాగా జూన్ 9న అతని బావమరిది లక్ష్మణ్ గ్రామంలోని ఒక మహిళతో పారిపోవ‌డంతో పోలీసులు సంజయ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం జూన్ 13న ప్రమోద్‌ను విచారించారు. అయితే కస్టడీలో ఉన్న సంజ‌య్‌ను కొందరు పోలీసు అధికారులు కొట్టారని, వారు అత‌ని నుంచి రూ. 1 లక్ష డిమాండ్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముందుగా ప‌దివేలు క‌ట్టి, మిగ‌తా 90 వేలు చెల్లిస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో సంజ‌య్‌ను విడుద‌ల చేశార‌ని తెలిపారు.అనంత‌రం జూన్ 22 న సంజ‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే పోలీసు అధికారులు నిరంత‌రం వేధింపుల‌కు గురిచేయ‌డం, పోలీస్ స్టేష‌న్‌కు పిలపించి బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టంతో మ‌నస్తాపం చెందిన సంజయ్ చ‌నిపోయాడ‌ని కుటుంబీకులు ఆరోపించారు.సంజయ్ మరించిన త‌ర్వాత ప్ర‌మోద్‌ను పోలీసులు మ‌ళ్లీ విచార‌ణ‌కు పిలించారు. దీంతో అత‌డు కూడా సోమ‌వారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యపై ఫిర్యాదు చేయవద్దని ప్రమోద్‌ను పోలీసులు హెచ్చరించినట్లు కుటుంబ సభ్యుడు ఆరోపించారు. కాగా జంట ఆత్మహత్యలపై గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భద్రతను పెంచారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z