Politics

జులై 20-21 తేదీల్లో తొలి ప్రపంచ కమ్మ మహాసభ

జులై 20-21 తేదీల్లో తొలి ప్రపంచ కమ్మ మహాసభ

కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(KGF) ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని HICCలో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు జెట్టి కుసుమకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.

భారతదేశజనాభాలో 1.5శాతంగా, ప్రపంచవ్యాప్తంగా 2.1కోట్ల మంది కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారని, వీరిని ఒకే వేదికపైకి తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి నైపుణ్యభివృద్ధి, రైతులకు ఆసరా, సభల నిర్వహణ, ఇతర సామజిక వర్గీయులకు చేయూతనందించడం, విశేష సేవలందించిన వారిని గుర్తించి వారిని సత్కరించడం వంటి లక్ష్యాలతో KGF పనిచేస్తుందని కుసుమకుమార్ వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఈ ఏడాది 20-21 తేదీల్లో నిర్వహించే తొలి మహాసభలో మేథోసంపద పరస్పర మార్పిడి, కమ్మ కుటుంబాల సమాచార బదిలీ, వెనుకబడిన కుటుంబాలకు ఆలంబన అందించడం, సేవా కార్యక్రమాల నిర్వహణ, విశిష్ట వ్యక్తుల గుర్తింపు, యువతకు చేయూత, రాజకీయ సాధికారత, వ్యవసాయానికి తోడ్పాటు, పెట్టుబడులు, ఉద్యోగవకాశాల్లో పెద్దపీట వేయడం వంటివాటిపై చర్చిస్తారని జెట్టి పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు www.kammaglobal.com వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z