NRI-NRT

చికాగోలో వనభోజనాలు. ఉల్లాసంగా ఆడిపాడిన ప్రవాసులు.

చికాగోలో వనభోజనాలు. ఉల్లాసంగా ఆడిపాడిన ప్రవాసులు.

చికాగో ఆంధ్ర సంఘం(CAA) వార్షిక వనభోజనాలు బస్సీ ఉడ్స్ లో నిర్వహించారు. ఈ ఏడాది వనభోజనాలతో పాటు పితృదినోత్సవ వేడుకలను కూడా నిర్వహించారు. సంప్రదాయ అరిటాకులో వడ్డించిన భోజనాలు, అన్ని వయసుల వారినీ ఆకట్టుకునే ఆట పాటలు, పలు పోటీలతో అతిథులను అలరించారు. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి సహకారంతో ఈ వేడుక నిర్వహించారు. 1000 మందికి పైగా చికాగో ప్రవాసులు పాల్గొన్నారు. టీవీ-సినీ కళాకారులు ఉదయ్ భాస్కర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

సవిత మునగ, శ్రీస్మిత నండూరి, ప్రియ మతుకుమల్లి, శృతి కూచంపూడి, రాధిక గరిమెళ్ళ, హరిణి మేడ, మల్లీశ్వరి పెదమల్లు, మాధురి యేటిగడ్డ, గీతిక ఐనపూడి, ఆశ్రిత్ కొత్తపల్లి, ఆద్య బెస్త, ఆరాధ్య బెస్త, శ్వేతకి బొజ్జ, కళ్యాణ్ కొత్తపల్లి, రేయాంష్ వేముల, విష్ణు హాసిని, విష్ణు తేజలు పలు పోటీలను సమన్వయపరిచి విజేతలకు బహుమతులను అందజేశారు. సతీశ్ పసుపులేటి, నరసింహ రెడ్డి ఒగ్గు, రాజు బొజ్జ, కాశి ఆళ్ళ, మల్లిక్ గోలి, సురేశ్ ఐనపూడి, సునీల్ ఆకులూరి, ధీరజ్ ఐనపూడి, తన్విక్ అండే, సుయాన్శ్, మృత్యుంజయరావు గొంటు, కృష్ణ జాస్తి, శైలజ సప్ప, లక్ష్మినాగ్ సూరిభొట్ల, గీతిక మండల, మురళీ రెడ్డివారి, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, శ్రీనివాస్ పద్యాల, గిరి రావు కొత్తమాసు, మనస్వి తూము, కావ్య శ్రీ చల్ల, ట్రస్టీలు శ్రీనివాస్-మల్లేశ్వరి పెదమల్లు, పద్మారావు అప్పలనేని, రాఘవ-శివబాల జాట్ల, దినకర్ కారుమూరి, డా. ఉమ కటికి, పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి, హేమంత్ తలపనేని, విసృత్, హాసినీ తలపనేని, లోహిత గంపాల, ఇషాన్వి వేముల, అమ్మాజీ, నరేష్ చింతమాని తదితరులు సహకరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z