Politics

పింఛన్ల పెంపు వల్ల ఏపీ ప్రభుత్వంపై ₹819కోట్ల భారం-NewsRoundup-June 29 2024

పింఛన్ల పెంపు వల్ల ఏపీ ప్రభుత్వంపై ₹819కోట్ల భారం-NewsRoundup-June 29 2024

* పులివెందులలోని మున్సిపల్‌ కౌన్సిలర్లతో వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. గత కొంత కాలంగా కౌన్సిలర్లు పార్టీపై అసమ్మతితో ఉన్నారనే సమాచారంతో ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

* సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు.

* విజయవాడ-జగదల్‌పూర్‌ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెప్పారు. ‘‘ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తునందున బైపాస్‌ రోడ్డు నిర్మించాలని కోరాం. ఖమ్మం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశాం. గత ప్రభుత్వం రూ.180 కోట్లు కేటాయించలేక రింగ్‌రోడ్డును పక్కన పెట్టేసింది. భద్రాచలం పట్టణంలోనూ కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించింది. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు.. జగ్గయ్యపేట నుంచి వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు 4 లైన్ల హైవేకి ప్రతిపాదనలు పంపించాం’’ అని మంత్రి తెలిపారు. కోదాడ-ఖమ్మం మధ్య రూ.1.039 కోట్లతో నిర్మించిన 32 కి.మీ రహదారి ఆగస్టు 30 కల్లా అందుబాటులోకి వస్తుందన్నారు. ఖమ్మం-కొరివి మధ్య రూ.445 కోట్లతో 37 కి.మీ రహదారి నిర్మాణానికి గతంలోనే అనుమతులిచ్చామని తెలిపారు. దీని నిర్మాణానికి మరో రెండేళ్లు పడుతుందని వెల్లడించారు.

* అమరావతి ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్‌ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది.

* బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్‌ అంటూ కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలపై ఆమె భర్త విక్కీ కౌశల్‌ (విచ్క్య్ ఖౌషల్) స్పందించారు. తన కొత్త చిత్రం ప్రమోషన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రూమర్‌ గురించి మాట్లాడారు.

* ప్రధాని మోదీని పెళ్లికి ఆహ్వానించారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా వరలక్ష్మి టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులను తన పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.

* శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. సరకా ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్‌ పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

* టీ20 ప్రపంచకప్‌లో (ట్20 వొర్ల్ద్ ఛుప్ 2024) భారత్‌ ఫైనల్‌కు చేరడంలో జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకొచ్చి పరుగులు నియంత్రించడంతోపాటు కీలక సమయంలో వికెట్లు తీశాడు.

* భారీ వర్షాల కారణంగా దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-1 పైకప్పులో కొంతభాగం శుక్రవారం కూలిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల్లోనే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ విమానాశ్రయం (ఋఅజ్కొత్ ఆఇర్పొర్త్)లో పైకప్పుగా ఏర్పాటు చేసిన టెంట్‌ ఊడిపడిపోయింది. దీంతో వరుస ఘటనలను ఉద్దేశిస్తూ కేంద్రంపై కాంగ్రెస్‌ (ఛొంగ్రెస్స్) విమర్శలు గుప్పించింది. వీటికి భాజపా గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఈ ఘటనకు నెహ్రూను నిందించొద్దని, ఎందుకంటే ఆయన విమానాశ్రయాలు కట్టించలేకపోయారని ఎద్దేవా చేసింది. గుజరాత్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లో నీరు నిలవకుండా ఉండేందుకు మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో టెర్మినల్‌ వెలుపల ప్రయాణికుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌ (చనొప్య్) కొంతభాగం చిరిగి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో కాంగ్రెస్‌ నేతలు ఈ ఘటనపై స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఈ ఎయిర్‌పోర్టును గతేడాదే మోదీ ప్రారంభించారని, అప్పుడే కూలిపోయిందని దుయ్యబట్టారు.

* పవన్‌కల్యాణ్‌ (ఫవన్ ఖల్యన్) కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ (హరి హర వీర ంఅల్లు). ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్‌ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనను గెలిపించడంతో పాటు, ఉపముఖ్యమంత్రిగానూ పవన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సమయం ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కేటాయిస్తున్నారు. దీంతో ‘హరిహర వీరమల్లు’ సెట్స్‌లోకి తిరిగి ఎప్పుడు అడుగుపెడతారా? అసలు ఇంకా ఎంత షూటింగ్‌ ఉందన్న ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి. వీటిపై చిత్ర నిర్మాత ఏఎం రత్నం స్పష్టతనిచ్చారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆ విశేషాలను పంచుకున్నారు.

* కేంద్రంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నీతీశ్ (ణితిష్ ఖుమర్) కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పార్టీ మోదీ సర్కారుకు గట్టి మెలిక పెట్టింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే తమ డిమాండ్లకు తెరతీసింది. తమ రాష్ట్రం బిహార్‌ (భిహర్)కు ప్రత్యేక హోదా (శ్పెచీల్ ఛతెగొర్య్ శ్తతుస్) ఇవ్వాలని అడిగింది. ఈమేరకు పార్టీ సమావేశంలో దీనిపై తీర్మానం చేసింది.

* ‘ఫలితాలు చూశాక.. షాక్‌ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్‌ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన వ్యాఖ్యలివి. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా బయటికొచ్చాయి. ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయనీ మాటలు అన్నట్లు తెలిసింది. ‘నిజంగా వెళ్లిపోదామనే అనిపించింది. ఆ షాక్‌లోంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే పట్టింది. కానీ, ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి, అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది చూశాకనే మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించింది. దాంతోనే మెల్లగా ఫలితాల నుంచి బయటికొచ్చా. ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయనేందుకు అనుమానాలు, కారణాలు ఏవి ఉన్నా, మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలి. సర్వేలు చేయించాం, వాటిలో ఎక్కడా వ్యతిరేకత రాలేదు. అందువల్లే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. కానీ ఫలితాలు ఇంకోలా వచ్చాయి. వాటిని చూసినపుడు నా పరిస్థితే ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో మీకూ ఇబ్బందిగానే ఉంటుంది. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేను బయటికొచ్చినట్లే మీరూ ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కండి’ అని నేతలతో ఆయన అన్నారు.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (ఆనంత్ ఆంబని)-రాధికా మర్చెంట్‌ పెళ్లి ముచ్చట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం, ప్రీవెడ్డింగ్‌ వేడుక అంగరంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ముందస్తు పెళ్లి వేడుకల (ఫ్రె వెద్దింగ్)కు అంబానీ కుటుంబం సిద్ధమైంది. ఇందులో భాగంగా పలు జంటలకు సామూహిక వివాహాలు (ంఅస్స్ వెద్దింగ్) జరిపించనున్నారు.

* ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్‌దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్‌ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం. ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడనుంది. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్‌ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఎన్నికల సమయంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయాను. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశా. ఏప్రిల్‌ నెల నుంచే పింఛన్‌ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చా. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకూ పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నాం’’ అని లేఖలో సీఎం పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z