* వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఏడో వార్డు సచివాలయం పరిధిలో పింఛను డబ్బు మాయమైంది. దుండగులు తన వద్ద నుంచి డబ్బు దోచుకెళ్లినట్లు సచివాలయ కార్యదర్శి మురళి తెలిపారు. సోమవారం ఉదయం పింఛను డబ్బు పంపిణీ చేసేందుకు వెళ్తుండగా స్పృహ తప్పి బైక్ పైనుంచి కింద పడిపోయానని.. ఈ క్రమంలో తన వద్ద ఉన్న రూ.4 లక్షలు ఎత్తుకెళ్లారని చెబుతున్నారు. అతడిని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పింఛను డబ్బు మాయం కావడంపై పోలీసులు, పురపాలక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
* పాఠాలు చెప్పాల్సిన స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయిని ఏకంగా ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొంది. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెపై కేసు నమోదు చేశారు. అమెరికా(USA)లోని న్యూజెర్సీలో ఫ్రీహోల్డ్ ఇంటర్మీడియట్ పాఠశాలలో 43 ఏళ్ల ఎలీసన్ హవెమాన్ అనే మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది మొదటినుంచి ఆమె విద్యార్థులను లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమె మాన్‌హట్టన్ కౌంటీ జైలులో ఉంటోంది.
* అతనో రక్షకభటుడు. తన పరిధిలో ప్రజలకు రక్షణ కల్పించడం అతని విధి. కానీ తన సొంత భార్య పాలిటే అతడు రాక్షసుడయ్యాడు. సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం ముందే అతను తన భార్యను దారుణంగా పొడిచి చంపాడు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఈ ఘటన చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వివరాల్లోకి వెళ్తే.. లోక్‌నాథ్ అనే వ్యక్తి హసన్ జిల్లాలోని హసన్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఓ భూమికి సంబంధించిన విషయంలో లోక్‌నాథ్‌కు ఆయన భార్య మమతకు మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో మమతను లోక్‌నాథ్ రోజూ కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో లోక్‌నాథ్ తనను హింసిస్తున్నాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు మమత ఇవాళ (సోమవారం) ఉదయం ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. దాంతో ఆమెను వెంబడించిన లోక్‌నాథ్ ఎస్పీ కార్యాలయం ముందే కత్తితో దారుణంగా పొడిచి చంపాడు.
* భార్యభర్తల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఓ డైవర్స్ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు.. భార్తభర్తలకు సంబంధించిన ఒకరి ఫేస్బుక్..ఇన్‌స్ట్రాగ్రామ్‌ను మరొకరు వాడొదనడం అనేది అనేది క్రూరత్వానికి సమానమైనదని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. హిందూవివాహ చట్టం(HMA) కింద విడాకులు కోరుతూ ఓ భర్త దాఖలు చసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. కేసు వివరాల్లోకి వెళ్తే…మహబూబ్‌నగర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి 2021 నవంబర్ 2 న జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఫిర్యాదు దారుడు దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ను HMA, 1955 యాక్ట్ న్ 13 (1) (ia) మరియు (ib) కింద అప్పీలుదారు పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టులో ఈ అప్పీల్ పై విచారణ జరుగగా.. కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. భార్యభర్తలు కలిసి ఉండటం అనేది వారి మనస్సుల కలయికపై ఆధారపడి ఉంటుందని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. జీవిత భాగస్వామి క్రూరత్వంగా వ్యవహరిస్తే కలిసి ఉండమని కోర్టు కూడా చెప్పదని వెల్లడించింది.
* నగరంలో వరుస హత్యలతో ప్రజలు బెంబేలెత్తున్నారు. చాదర్ ఘాట్ పీ ఎస్ కు దగ్గర్లో మలక్ పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి రౌడీ షీటర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. మృతుడు రెయిన్ బజార్ కు చెందిన సయ్యద్ నజఫ్ అలీ అనే రౌడీ షీటర్ గా పోలీసులు గుర్తించారు. నజఫ్ అలీ పై 3 మర్డర్ కేసులు ఉన్నా.. 2021 నుంచి ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడలేదు. కానీ.. నజఫ్ అలీపై గుర్తు తెలియని వ్యక్తులు చదార్ ఘాట్ లోని మలక్ పేట మెట్రో వద్ద దగ్గర కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అదే రీతిలో బేగంపేటలో గురువారం హత్య జరిగింది. వరుస మడ్డర్లతో హైదరాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. పోలీసు ఉన్నత అధికారులు, డీసీపీ స్నేహ మెహ్రా, ఏసీపీ మలక్ పేట శ్యామ్ బాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించి, మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z