* మూడు దశాబ్దాల క్రితం నాటి ముంబయి (Mumbai) అల్లర్ల కేసులో తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1993లో ముంబయిలో అలర్లు చెలరేగాయి. ఆ సమయంలో నగరంలో చట్టవిరుద్ధంగా జనాలను పోగు చేసిన కేసుతోపాటు ఓ హత్య ఘటనలో సయ్యద్ నాదిర్ షా అబ్బాస్ ఖాన్ (65) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు.. అప్పటినుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కోర్టు అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెంట్రల్ ముంబయి సేవ్రీలోని నిందితుడి ఇంటికి పోలీసులు అనేకసార్లు వెళ్లినా.. ఆచూకీ గుర్తించలేకపోయారు. చివరకు బంధువుల ఫోన్ల రికార్డులను పరిశీలించగా.. ఎట్టకేలకు ఆచూకీ లభ్యమైంది. జూన్ 29న తన ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ప్రణాళిక ప్రకారం వ్యవహరించిన పోలీసులు వలపన్ని అతడిని అరెస్టు చేశారు. 1993 కేసులో నిందితుడిని మళ్లీ అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
* శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా.. 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
* పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పల్ ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్ అయిన ఈ కేసు ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్‌కు బదిలీ కావడంతో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన యువతి(27)… వివాహం చేసుకోవడానికి యాప్‌లో శోధిస్తుండగా.. ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలోని జయప్రకాష్‌నగర్‌లో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న ముత్తుమ్ముల రాజశేఖర్(30) పరిచయమయ్యాడు. తాను ఫొటోగ్రాఫర్‌నని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరిచయం పెంచుకున్నాడు. యువతికి చెందిన ఈ-మెయిల్ ఐడీని కూడా వినియోగించేవాడు. గత నెల 24న యువతికి ఫోన్ చేసిన రాజశేఖర్ తన ఫోటో స్టూడియోకు రమ్మని పిలిచాడు. మరుసటి రోజు స్టూడియోకు వెళ్లిన యువతిని బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకపోతే మెయిల్ ద్వారా లభ్యమైన నీ ఫొటోలను అందరికీ పంపి పరువు తీస్తానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని హెచ్చరించాడు. బాధితురాలు అక్కడి నుంచి బయటపడి సమీప బంధువైన మహిళకు విషయం చెప్పింది. వారు ఉప్పల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి జీరో ఎఫ్‌ఐఆర్ ఎస్సార్‌నగర్‌కు బదిలీ కావడంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
* ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ (Hathras)లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రతీభాన్‌పూర్‌లో మంగళవారం శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం (religious event) జరిగింది. ఈ కార్యక్రమం ముగియగానే స్థానికులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
* బీహార్‌లో దారుణం జరిగింది. ఓ మహిళా డాక్టర్ తన బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసింది(Genitals Chopped). సరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యా యత్నం కేసులో ఆ మహిళా డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బాధిత వ్యక్తి మధురా బ్లాక్‌లోని వార్డు నెంబర్ 12 కౌన్సిలర్. ప్రస్తుతం అతన్ని పాట్నా మెడికల్ కాలేజీలో చికిత్స కోసం చేర్పించారు. గత అయిదేళ్ల నుంచి కౌన్సిలర్‌తో ఆ లేడీ డాక్టర్ రిలేషన్‌లో ఉన్నది. ఈ విషయాన్ని ఆమె కూడా అంగీకరించింది. అయితే పెళ్లి చేసుకునేందుకు ఆ వ్యక్తి నిరాకరించడంతో.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు కూడా లేడీ డాక్టర్ సిద్దమైంది. పెళ్లి కోసం ఆమె కోర్టుకు వెళ్లింది. కానీ బాధిత వ్యక్తి మాత్రం రాలేకపోయాడు. బాయ్‌ఫ్రెండ్ వ్యవహారంపై విరక్తి చెందిన ఆ డాక్టర్.. తన ఇంటికి అతన్ని పిలిచింది. ఇంటికి వచ్చిన ఆ కౌన్సిలర్ పురుషాంగాన్ని కట్ చేసింది లేడీ డాక్టర్. అయితే కౌన్సిలర్ అరుపులు విన్న స్థానికులు .. జరిగిన ఘటన గురించి పోలీసులకు తెలిపారు. బెడ్‌పై రక్తపు మడుగులో ఉన్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిందితురాలు అవివాహిత. ఆమె వయసు 25 ఏళ్లు. హజిపూర్ ఆమె స్వస్థలం. మధౌరాలో ఆమె ప్రాక్టీసు చేస్తోంది. బాధిత వ్యక్తి కూడా అవివాహితుడే అని మధౌరా పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. నిందితురాలని అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z