Devotional

Telugu Horoscope – July 03 2024

Telugu Horoscope – July 03 2024

మేషం
కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. శివ సందర్శనం శుభప్రదం.

వృషభం
ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆస్తిని వృద్ధిచేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

మిథునం
మీ మీ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. రెచ్చగొట్టే వారు ఉన్నారు,విచక్షణా జ్ఞానంతో ముందుకు సాగండి. శ్రీమహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.

కర్కాటకం
మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

సింహం
స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.

కన్య
ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన పనిని బుద్ధిబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రీలక్ష్మి సందర్శనం ఉత్తమం.

తుల
ఏ పనిని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టుదల వదలకండి. మనఃశ్శాంతిని తగ్గించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతత కోసం ఈశ్వర సందర్శనం శుభప్రదం.

వృశ్చికం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు, నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మరిన్ని శుభఫలితాలు వస్తాయి.

ధనుస్సు
అనుకూలమైన సమయం. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

మకరం
మిశ్రమకాలం. ప్రారంభించిన పనిలో బాగా శ్రమించాలి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరం. ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

కుంభం
కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు వస్తాయి. గొప్ప ఆర్థిక లాభాలు ఉన్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తిచేస్తారు. శ్రీరామ సందర్శనం మరింత మేలు చేస్తుంది.

మీనం
దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. శ్రీమహాలక్ష్మి సందర్శనం శుభకరం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z