NRI-NRT

బ్రిటన్‌లో ఎన్నికల సమరం-NewsRoundup-July 04 2024

బ్రిటన్‌లో ఎన్నికల సమరం-NewsRoundup-July 04 2024

* తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధాని, హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

* కాంగ్రెస్‌ (Congress) నేతృత్వంలో ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమి (INDIA Bloc)గా ఏర్పడి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించాయి. ఇదే ఉత్సాహంతో త్వరలో జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి.

* ఈవీఏం పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్‌ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. పిన్నెల్లిని కలిసేందుకు ఆయన హెలికాప్టర్‌లో నెల్లూరు జైలుకు వెళ్లారని చెప్పారు.

* దిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశం తర్వాత కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు.

* ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన సినిమా ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ధనుష్‌ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు.

* చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా దీనిపై నిర్మాణసంస్థ ఓ అప్‌డేట్‌ షేర్‌ చేసింది. సినిమా డబ్బింగ్‌ వర్క్‌ మొదలైనట్లు తెలిపింది.

* ఆర్మీ తరహా ట్రైనింగ్‌తో పాకిస్థాన్‌ ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) కోసం సిద్ధమయ్యారు. ట్రెక్కింగ్‌ చేయడం, అడవుల్లో, నదుల్లో నడుస్తూ సాధన చేశారు. తీరా, పొట్టి కప్‌ గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన పాక్‌ తీవ్ర విమర్శలపాలైంది.

* ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో భారత్‌లో నిరుద్యోగ రేటు పెరిగింది. మేలో 7శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి చేరింది. ఇది 8 నెలల గరిష్ఠం అని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE)’ విడుదల చేసిన వినియోగదారుల పిరమిడ్ల గృహసర్వేలో బహిర్గతమైంది.

* భాజపా సీనియర్‌ నేత, రాజస్థాన్ (Rajasthan) మంత్రి కిరోడి లాల్‌ మీనా (Kirodi Lal Meena) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బాధ్యత వహించిన స్థానాల్లో కాషాయ పార్టీ ఓడిపోవడమే అందుకు కారణం.

* వాస్తవాధీన రేఖ (LAC)ను గౌరవించడంతోపాటు సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సిందేనని భారత విదేశాంగశాఖ చైనాకు స్పష్టంచేసింది. వీటితోపాటు సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

* సినిమాలతో బిజీగా ఉంటూనే అభిమానులతో ముచ్చటిస్తుంటారు నటి శ్రుతి హాసన్‌. తాజాగా ఇన్‌స్టాలో తన ఫాలోవర్స్‌తో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రుతి ‘ప్రేమ’కు అర్థం చెబుతూ.. అది ఒక అద్భుతమైన భావన అన్నారు. మన జీవితాల్ని నడిపించేది ప్రేమేనని.. ప్రతి ఒక్కరూ తాము చేసే పనిని ప్రేమించాలని సూచించారు. పెళ్లి గురించి కొందరు ప్రశ్నించడంపై కాస్త అసహనం వ్యక్తంచేశారు.

* ఈవీఏం పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్‌ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. పిన్నెల్లిని కలిసేందుకు ఆయన హెలికాప్టర్‌లో నెల్లూరు జైలుకు వెళ్లారని చెప్పారు. జైలులో పిన్నెల్లిని కలిసేందుకు ఉన్న ములాఖత్‌లు అయిపోయాయని, మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు. అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని తెలిసి కూడా జగన్‌.. ఘర్షణ వాతావరణం సృష్టించడానికే ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోందన్నారు. జైలు నుంచి బయటకొచ్చాక ఆయన ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారన్నారు. ములాఖత్‌లపై జైళ్ల శాఖ ఐజీ నుంచి కూడా నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తానని హోంమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం తనపై అట్రాసిటీ కేసులు పెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేపడతామన్నారు. వాటిపై న్యాయపరంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

* రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు గురువారం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా అందజేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమయంలో బుధవారం కేకే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన పార్టీ మారడంతో రాజీనామా చేశారు. కేశవరావును బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాజ్యసభకు నామినేట్‌ చేశారు. 2020 సెప్టెంబర్‌లో కేకే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆయన గత ఏప్రిల్‌లో పార్టీ మారిన విషయం తెలిసిందే. నిన్న జాతీయ అధ్యక్షుడి సమక్షంలో పార్టీ చేరి.. తాజాగా రాజ్యసభకు రాజీనామా చేశారు.

* ఊరిలో తలుపులు, చెట్లకు మంత్రించిన నిమ్మకాయలు.. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వెదజల్లిన డబ్బులు, అన్నం.. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే పల్నాడు జిల్లా చిన్నతురకపాలెం ఊళ్లో కనిపిస్తున్న దృశ్యమిదీ! అసలేం జరుగుతోంది? ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియక ఆ గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఊరిలో చేతబడి జరుగుతోందని భయంతో జనం వణికిపోతున్నారు. రాత్రయ్యిందంటే చాలు.. నిద్రపోకుండా జాగారం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం చిన్నతురకపాలెంలో 15 రోజుల క్రితం ఓ వ్యక్తి ఇంటి ముందు గోడకు మేకులు కొట్టి కనిపించాయి. ఆ తర్వాత రోజు చెట్టుకు అలాగే మేకులు కనిపించాయి. మొదట వీటిని గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. ఎవరో ఆకతాయిలు చేసి ఉంటారని లైట్‌ తీసుకున్నారు. కానీ అప్పటి నుంచి ప్రతిరోజూ ఇదే తంతు జరుగుతోంది. మొదట్లో మేకులు మాత్రమే కనిపించగా.. ఇప్పుడు నిమ్మకాయలు, పసుపు-కుంకుమ కూడా కనిపిస్తున్నాయి. రాత్రయితే చాలు ఎవరో నిమ్మకాయలు పెట్టడంతో పాటు రోడ్లపై డబ్బులు, అన్నం వెదజల్లి వెళ్తున్నారు. దీంతో ఊరిలో ఎవరో చేతబడి చేస్తున్నారని జనాల్లో అనుమానం మొదలయ్యింది. అప్పట్నుంచి అందరిలోనూ ఒకటే ఆందోళన. రాత్రయ్యిందంటే చాలు నిద్ర పట్టడం లేదు.. పొద్దున లేవగానే ఏ ఘోరం చూడాల్సి వస్తుందోనని భయపడిపోతున్నారు. దీంతో రోజూ తెల్లవారగానే తమ గోడలను చెక్‌ చేయించుకుంటున్నారు. క్షుద్రపూజల భయంతో గ్రామస్థులు నిద్రపోవడం కూడా మానేసి జాగారం చేస్తున్నారు. అర్ధరాత్రులు కర్రలతో కాపలా కాస్తున్నారు. రాత్రిళ్లు ఇతరులు ఎవరూ తమ గల్లీల్లోకి రాకుండా ముళ్ల కంచెలతో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. కాగా, 15 రోజులుగా చేతబడి ఆనవాళ్లు కనిపించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* విజయవాడలోని కృష్ణా కరకట్టపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు చెందిన రికార్డులను దహనం చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై అధికారులను ఆయన ఆరా తీశారు. దగ్ధమైన ఫైల్స్‌, రికార్డుల వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు.ప్రభుత్వ రికార్డుల దహనానికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్‌, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి? భద్రపరిచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏంటో వెల్లడించాలని సూచించారు. ఇక, కరకట్టపై దస్త్రాలను తగులబెట్టిన అంశంపై పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దస్త్రాలతో పాటు కంప్యూటర్‌ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండటాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.విజయవాడలో ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసేందుకు యత్నించిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకర్ని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మాజీ చైర్మన్‌ సమీర్‌ శర్మ కారు డ్రైవర్‌ నాగరాజుగా పోలీసులు గుర్తించారు.మైనింగ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు చెందిన రికార్డులను గుట్టుచప్పుడు కాకుండా ధ్వంసం చేసేందుకు డ్రైవర్‌ నాగరాజు ప్రయత్నించారు. రామారావు అనే యువకుడితో కలిసి కారులో యనమలకుదురు కట్ట వద్దకు వచ్చిన నాగరాజు.. బస్తాల్లో తీసుకొచ్చిన రికార్డులను తగులబెట్టాడు. ఇది గమనించిన స్థానికులు అనుమానంతో వారిని నిలదీశారు. దీంతో భయపడిపోయిన నాగరాజు, రామారావు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. ఈ ఘటనలో మైనింగ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు చెందిన పలు పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లు, లెటర్‌ హెడ్స్‌, క్యాసెట్స్‌ దగ్ధమయ్యాయి.స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పెనమలూరు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పీసీబీ మాజీ చైర్మన్‌ సమీర్‌ శర్మ ఆదేశాల మేరకే తాను పత్రాలు తగులబెట్టినట్లు నాగరాజు వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఫైల్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎందుకు తగులబెట్టారు? అనే దానిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

* ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డు విన్న‌ర్ కీరవాణి పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ విశ్వంభ‌ర సెట్స్ నుంచి స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ‘విశ్వంభర అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్‌గా డ‌బ్బింగ్ ప‌నులు కూడా మొద‌లుపెట్టింది. అయితే నేడు కీరవాణి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిరు ఒక స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేశాడు. ఈ వీడియోతో త‌నకు పాత రోజులు గుర్తొచ్చాయంటూ తెలిపాడు.

* బ్రిటన్ ‌(britain)లో సార్వత్రిక ఎన్నికల (UK Election 2024) సమరం మొదలైంది. ఈ రోజు(జూలై 4న) ప్రధాని పదవి కోసం ఓటింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 650 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఏ పార్టీ అయినా మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు అవసరం ఉంటుంది. ఈ ఎన్నికల్లో రిషి సునాక్‌ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ (Conservative Party), కెయిర్‌ స్టార్మర్‌ (Keir Starmer) ఆధ్వర్యంలోని లేబర్‌ పార్టీ (Labour party) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 46.5 మిలియన్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తదుపరి ప్రధానిని ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం 40 వేల పోలింగ్‌ బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిటన్‌లోని స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.

* గ్రూప్‌-1 మెయిన్స్‌పై (Group-1 Mains) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాన పరీక్షకు 1:100 ప్రాతిపదికన ఎంపికచేయాలని ఉద్యోగార్థులు గతకొన్నిరోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 మెయిన్స్‌పై టీజీపీఎస్సీ (TGPSC) స్పష్టతనిచ్చింది. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తేల్చిచెప్పింది. పరీక్షకు సిద్ధమవుతున్నది. కాగా, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు తమ పోరాటాలను ఉధృతం చేస్తున్నారు. రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 5న టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేలాది సంఖ్యలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చేందుకు గురువారం వరకు గడువు అని అల్టిమేటం జారీచేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే నిరుద్యోగుల ధర్నా తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌, గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి అమలు, గ్రూప్‌ 2, 3, డీఎస్సీలో పోస్టుల పెంపు వంటి డిమాండ్లపై ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘హలో నిరుద్యోగి.. చలో టీజీపీఎస్సీ ముట్టడి’కి బీఆర్‌ఎస్‌తోపాటు ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.

* జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగకు చెందిన ప్రముఖ సినీగేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్‌ గ్రామంలో ఆస్కార్‌ గ్రంథాలయాన్ని నిర్మించాడు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్‌ చేతుల మీదుగా గురువారం ప్రారంభించనున్నారు. ఆసార్‌ అవార్డుకు తీపిగుర్తుగా రూ.36 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించి ఆసార్‌ గ్రంథాలయం అని నామకరణం చేశారు.

* ఆంధ్రప్రదేశ్ ఎలిబిబిలిటీ టెస్ట్‌ (TET)-2024కు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల (Online Applications) ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమయ్యింది. దరఖాస్తుల స్వీకరణ జులై 17 వరకు కొనసాగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. త్వరలోనే పరీక్ష తేదీలు వెల్లడిస్తామని అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగుల వినతులకు సానుకూలంగా స్పందిస్తుంది. ఇందులో భాగంగా టెట్‌ పరీక్షకు, డీఎస్సీ(DSC) పరీక్షలకు సన్నద్ధం కావడానికి సమయం కావాలని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ (Minister Nara Lokesh) స్పందించారు. టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య కొంత సమయం పొడగించి పరీక్షల తేదీని త్వరలో వెల్లడించనున్నారు. దరఖాస్తు రుసుముల చెల్లింపులకు ఈనెల 16వ తేదీ వరకు ఆఖరు తేదీగా నిర్ణయించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z