Fashion

మీ కండీషనర్ సరైనదేనా?

మీ కండీషనర్ సరైనదేనా?

కురులకు పోషణ అందాలి, మెత్తగా పట్టుకుచ్చులా ఉండాలని కండిషనర్‌ రాస్తుంటాం. తీరా అదే కొన్నిసార్లు పొడిబారేలా చేస్తుంది. ఇంకొన్నిసార్లు సమయానికి తెచ్చుకోవడం మర్చిపోయినా జుట్టు బరకగా మారుతుంది. సమస్య ఏదైనా ఈ సహజ కండిషనర్ల సాయం తీసుకోండి.

* పావు కప్పు తేనెకు చెంచా ఆలివ్‌ ఆయిల్‌ చేర్చి, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలస్నానం పూర్తయ్యాక తడితలకు పట్టించి, పది నిమిషాలు వదిలేయాలి. ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరి. ఈ మిశ్రమం కురులను నిగనిగలాడేలా చేస్తుంది.

* రెండు గుడ్ల తెల్లసొనకు స్పూను తేనె, కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి, తలకు పట్టించండి. పావుగంటయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరి. జుట్టు పట్టుకుచ్చులా ఆరోగ్యంగా మెరవడం ఖాయం.

* నాలుగు స్పూన్ల బేకింగ్‌ సోడా తీసుకోండి. తలస్నానం చేశాక మాడు నుంచి కురుల వరకు దీన్ని పట్టించి, అయిదు నిమిషాలు మృదువుగా మర్దనా చేయండి. అరగంటాగి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చాలు. ఇది చుండ్రు సహా ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z