దేశంలో ఈ ఏడాది ప్రథమార్థంలో ఇళ్ల అమ్మకాలు, ఆఫీస్ లావాదేవీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఫ్లాగ్‌షిప్ రిపోర్ట్ ప్రకారం.. 2024 ప్రథమార్థంలో (హెచ్ 1) దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ మార్కెట్ లావాదేవీలు రికార్డు స్థాయిలో 33 శాతం వార్షిక వృద్ధితో 34.7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. గతేడాది ప్రథమార్థంలో ఇవి 26.1 మిలియన్ చదరపు అడుగులు ఉండేవి. 2024 జనవరి నుంచి జూన్ వరకు ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాస, కార్యాలయ మార్కెట్ పనితీరును విశ్లేషించిన ఈ నివేదిక 8.4 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలతో బెంగళూరు అతిపెద్ద కార్యాలయ మార్కెట్‌గా నిలిచిందని, ఇది దేశవ్యాప్తంగా మొత్తం కార్యాలయ పరిమాణ లావాదేవీల్లో 26 శాతం అని వెల్లడించింది.
ముంబై (5.8 మిలియన్ చదరపు అడుగులు), ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (5.7 మిలియన్ చదరపు అడుగులు), హైదరాబాద్ (5.0 మిలియన్ చదరపు అడుగులు) మార్కెట్లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వృద్ధి పరంగా చూస్తే అహ్మదాబాద్‌లో అత్యధికంగా 218 శాతం వృద్ధి నమోదైంది. గ్రేడ్-ఎ స్థలం తీవ్రమైన పరిమితి కారణంగా లావాదేవీ పరిమాణాలలో తగ్గుదల చూసిన ఏకైక మార్కెట్ చెన్నై. 2024 ప్రథమార్థంలో మొత్తం 1,73,241 యూనిట్ల అమ్మకాలతో రెసిడెన్షియల్ విభాగంలో అమ్మకాల పరిమాణాలు 11 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. 2024 హెచ్1లో అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ముంబైలో అత్యధికంగా 47,259 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వృద్ధి పరంగా చూస్తే కోల్‌కతాలో అత్యధికంగా 25 శాతం, హైదరాబాద్ 21 శాతం (18,573 యూనిట్లు) విక్రయాలు జరిగాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z