NRI-NRT

రక్తదానం చేసిన సింగపూర్ ప్రవాసులు

సింగపూర్ లోని శ్రీ సెంపగ వినాయక దేవాలయంలో సింగపూర్ తెలుగు సమాజం, శ్రీ సత్యసాయి గ్లోబల్ ఆర్గనైజేషన్ సింగపూర్, శ్రీ సెంపగ వినాయగర్ టెంపుల్, సింగపూర్ సిలోన్ తమిళ్ అసోసియేషన్, మునీశ్వరన్ కమ్యూనిటీ సర్వీసెస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. 120 మంది దాతలు రక్తదానం చేశారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి దాతలకు ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సింగపూర్ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తోందన్నారు. కోవిద్-19 మహమ్మారి సమయంలో 9 సార్లు రక్తదాన శిబిరాలను నిర్వహించి తెలుగు సమాజం రికార్డు సృష్టించింది. పాలెపు మల్లిక్, వైదా మహేష్, రాపేటి జనార్థనరావు, జ్యోతీశ్వరరెడ్డి, పోలిశెట్టి అనిల్ కుమార్ తదితరులు పాల్గొని సహకరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z