Devotional

Telugu Horoscope – July 05 2024

Telugu Horoscope – July 05 2024

మేషం
మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. తృతీయంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

వృషభం
మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. వ్యయంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. మీ చుట్టూ గిట్టనివాళ్లు చేరి మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.

మిథునం
ప్రారంభించిన పనిని త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీవేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.

కర్కాటకం
ధర్మ సిద్ది ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలుగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

సింహం
అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

కన్య
నిర్ణీత కాలంలో పనులను పూర్తిచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అలసటకు గురవకుండా చూసుకోవాలి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

తుల
కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు ఆలోచనలు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త. కలహాలకు తావివ్వరాదు. శివారాధన ఉత్తమం.

వృశ్చికం
మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. చంద్ర ధ్యానం శుభప్రదం.

ధనుస్సు
నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. విష్ణు ఆరాధన శుభప్రదం.

మకరం
అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.

కుంభం
మీలోని వినయవిధేయతలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. తోటి వ్యక్తులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అష్టలక్ష్మీస్తోత్రం చదివితే మంచిది.

మీనం
మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మంచిది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z