Agriculture

ఆగష్టు వరకు కృష్ణా డెల్టాకు నీరు ఉండదు

ఆగష్టు వరకు కృష్ణా డెల్టాకు నీరు ఉండదు

కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. ‘‘పులిచింతల ప్రాజెక్టులో గతంలో 40 టీఎంసీలు నిల్వ ఉంచుకొని వాడుకునే వాళ్లం. ప్రస్తుతం పులిచింతలలో అర టీఎంసీ కూడా లేదు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు కొంచెం తాగు, సాగునీరు ఇవ్వగలుగుతున్నాం. ఐదేళ్లుగా నిర్వహణ సరిగా లేక పట్టిసీమ మోటార్లు పనిచేయడం లేదు. జగన్‌ పరిపాలన వల్ల జలవనరులశాఖ బాగా నష్టపోయింది. అసమర్థ పాలన వల్ల సాగునీటి ప్రాజెక్టులు 20 ఏళ్లు వెనక్కి వెళ్లాయి. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z