భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్(Priyanshu Rajawat) కెనడా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ (Treesa Jolly) – గాయత్రి గోపిచంద్(Gayatri Gopichand)లు సైతం క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. తకుమా ఒబయశిని(జపాన్)తో శుక్రవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో రజావత్ తన రాకెట్ పవర్ చూపించాడు.
తన కంటే మెరుగైన ర్యాంకర్ అయిన తకుమాకు రజావత్ వరుస సెట్లలో చుక్కలు చూపించాడు. వరుస సెట్లలో21-19, 21-11తో జయభేరి మోగించి క్వార్టర్స్‌లో కాలు మోపాడు. తర్వాతి రౌండ్‌లో నాలుగో సీడ్ అండర్స్ ఆంటోన్సెన్‌తో భారత షట్లర్ తలపడనున్నాడు.
ఇక మహిళల డబుల్స్‌లో త్రిసా, గాయత్రి జోడీ అదరగొట్టింది. తమకంటే తక్కవ ర్యాంక్ ద్వయమైన నటస్జా ఆంధోనిసెన్, అలిస్సా ట్రిస్టోసెటొనోపై విక్టరీ సాధించింది. తొలి సెట్ కోల్పోయినా పట్టువిడువక పోరాడిన త్రిసా, గాయత్రి జంట 17-21, 21-7, 21-8తో అలవోకగా గెలుపొందింది. మరో మ్యాచ్‌లో కృష్ణ సాయి, అనుపమలు.. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్, రుత్వికలు ఓటమి పాలయ్యారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z