DailyDose

విశాఖ ఎన్నారై ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్-CrimeNews-July 05 2024

విశాఖ ఎన్నారై ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్-CrimeNews-July 05 2024

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట (Hathras Stampede) ఘటన 121 మందిని బలిగొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తన విచారణను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 90 మంది వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఏడీజీ అనుపమ్‌ కురుక్షేత్ర తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులదే తప్పిదమని ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు సూచిస్తున్నాయని పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు. ‘‘తొక్కిసలాట ఘటనపై రూపొందించిన ప్రాథమిక నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఇప్పటికే సమర్పించాం. హాథ్రస్‌ డీఎం ఆశీష్‌ కుమార్‌, ఎస్పీ నిపుణ్‌ అగర్వాల్‌, ఇతర అధికారుల స్టేట్‌మెంట్‌లను ఇందులో పొందుపర్చాం. కేసులో పూర్తిస్థాయి దర్యాప్తును ముమ్మరం చేశాం. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలు.. నిర్వాహకుల అపరాధాన్ని సూచిస్తున్నాయి’’ అని ఏడీజీ తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. భోలే బాబా ఆచూకీ లభించాల్సి ఉంది. కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చలేదని అలీగఢ్‌ ఐజీ శాలభ్‌ మాథుర్‌ గురువారం తెలిపారు.

* దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్‌ శివారు పెద్ద అంబర్‌పేట సమీపంలో ఔటర్‌ రింగురోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జాతీయ రహదారిపై పార్కింగ్‌ వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో నల్గొండ పోలీసులు అప్రమత్తమై నిఘా పెట్టారు. ఆ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్‌ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా యత్నించారు. పెద్దఅంబర్‌పేట సమీపంలోని ఓఆర్‌ఆర్‌ వద్దకు వచ్చేసరికి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కత్తులతో ఎదురుదాడి చేయడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

* ఒడిశా నుంచి బస్సులో హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేస్తున్న16.1 కిలోల గంజాయిని గురువారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఎస్టీఎప్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఒడిశా నుంచి బస్సులో రూ.3 లక్షల విలువ చేసే గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్న విష‌య‌మై నిఘా వ‌ర్గాల‌కు స‌మాచారం అందింది. దీంతో హయ‌త్ న‌గ‌ర్ వ‌ద్ద బ‌స్సులో త‌నిఖీ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్న‌ట్లు ఎస్టీఎఫ్ టీమ్‌ లీడర్‌ ఎన్‌. అంజి రెడ్డి తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్న‌ జయదేవ్‌ నెలూర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు ప్ర‌శ్నించిన‌ప్పుడు ధూల్‌పేట‌లోని అశోక్ సింగ్‌కు ఇవ్వ‌డానికి గంజాయి తెచ్చిన‌ట్లు జ‌య‌దేవ్ నెలూర్ చెప్పాడు. కాగా, అశోక్ సింగ్ త‌ప్పించుకున్నాడ‌ని ఎస్టీఎఫ్ పోలీసులు చెప్పారు.

* టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌పై పోలీసు కేసు నమోదైంది. తనను నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. రాజ్‌ తరుణ్‌ తనను వదిలేయడానికి హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడిపైనా ఫిర్యాదు చేసింది. రాజ్‌ తరుణ్‌, తాను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని , గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది.

* కిడ్నీ మార్పిడి కేసులో విశాఖ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఎన్ఆర్ఐ ఆసుపత్రి.. కిడ్నీ మార్పిడి చేస్తామని పది లక్షలు దోచేసి.. మొహం చాటేసింది. కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడుగా వ్యవహరించారు. ⁠డీసీపీ-1ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణకు సీపీ శంఖబ్రత బాగ్చీ స్పెషల్ టీం వేశారు. ⁠నేటి నుంచి కిడ్నీ రాకెట్ కేసులో విచారణ జోరు అందుకుంది.⁠ నిందితులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z