పని ఒత్తిడి, పని ప్రదేశాల్లో వేధింపులు వంటివి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనల గురించి వింటుంటాం. ఇలాంటి ఫీలింగ్స్ మనుషులకే కాదు రోబోలకు కూడా కలుగుతాయా? అవి కూడా ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాయా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. కొరియాలో తాజాగా జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ.
దక్షిణ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్‌లో ఓ రోబో సివిల్ సర్వెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇటీవల మెట్ల మీద నుంచి కిందకు పడిపోయింది. భవనం మొదటి, రెండో అంతస్తుల మధ్య ఉన్న మెట్ల మార్గంలో పడిపోయింది. ఈ ఘటనకు ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని అక్కడే ఉన్న ఉద్యోగులు తెలిపారు. ఏదో వెతుకుతున్నట్లుగా అటూ ఇటూ తిరుగుతూ ఉండేదని పేర్కొంటున్నారు. ఈ ఉదంతాన్ని రోబో ఆత్మహత్యగా భావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనపై సిటీ కౌన్సిల్ అధికారులు తక్షణమే స్పందించారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు ప్రకటించారు. కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ కంపెనీ బేర్ రోబోటిక్స్ ఈ రోబోను రూపొందించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా విధులు నిర్వర్తించేది. పనిలో విసుగు చెందడం వల్స్తూలే రోబో ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాలో రోబోల వినియోగం ఎక్కువ. ప్రతి పది మంది ఉద్యోగులకు సాయం చేసేందుకు ఓ రోబో ఉంటుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z