Devotional

Telugu Horoscope – July 09 2024

Telugu Horoscope – July 09 2024

మేషం
సంపూర్ణ ఆత్మబలంతో విజయసిద్ధి కలదు. మీ మీ రంగాల్లో ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. అస్థిర నిర్ణయాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలకు తావివ్వకండి. ఆదిత్యహృదయం చదివితే మంచిది.

వృషభం
విశేషమైన ఏకాగ్రతతో ప్రయత్నాలు నెరవేరుతాయి. తోటి వారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. చతుర్థంలో చంద్ర సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తోంది. మనఃశ్శాంతి కోసం చంద్రధ్యానం చేయండి.

మిథునం
చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

కర్కాటకం
మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయం సాధిస్తారు. తోటి వారి సహకారంతో పనులు పూర్తవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంది. మనఃశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి. సూర్యస్తుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సింహం
ప్రారంభించబోయే పనిలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. దైవబలం రక్షిస్తుంది. వ్యాపార పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. శ్రీలక్ష్మీస్తుతి అదృష్టాన్ని కలిగిస్తుంది.

కన్య
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. పెద్దలతో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు మనసులో అనుకుని మాట్లాడటం మంచిది. ద్వాదశంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నారు. మనఃశ్శాంతి కోసం ఈశ్వర ఆరాధన చేయండి.

తుల
మనోబలంతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వర ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

వృశ్చికం
ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఎదుర్కొంటారు. విజయం వరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఎవర్ని అతిగా నమ్మి మోసపోకండి. ప్రయాణంలో జాగ్రత్త. శివ ధ్యానం చేస్తే మంచిది.

ధనుస్సు
మీ మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో పనులను పూర్తిచేస్తారు. ప్రశంసలను అందుకుంటారు. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. నవమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఎవరినీ అతిగా నమ్మి మోసపోవద్దు. దుర్గాధ్యానం చేస్తే మంచిది.

మకరం
కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నిరుత్సాహపడకుండా పనిచేస్తే విజయానికి చేరువవుతారు. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీసూర్యనారాయణమూర్తి సందర్శనం శ్రేయోదాయకం.

కుంభం
మీదైన రంగంలో పట్టుదల, ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు కుటుంబ సభ్యులు అంగీకారం తప్పనిసరి. ముఖ్యమైన విషయాల్లో ముందుచూపుతో వ్యవహరించడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయి. గణపతిని స్మరిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

మీనం
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్థులకు శుభకాలం. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z