టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తోన్న కృత్రిమ మేధతో టీచర్లు, న్యూస్‌రీడర్లూ, ఇన్‌ఫ్లుయెన్సర్లు… ఇలా చాలామంది వృత్తి నిపుణులే పుట్టుకొచ్చారు. వీరంతా సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తూ, వాణిజ్య ప్రకటనలు, రీల్స్‌తో లక్షల మందిని ఆకట్టుకుంటున్నారు. అసలు నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మలేని పరిస్థితి ఉంది. అందుకే ఇలాంటి సుందరాంగుల కోసం ‘మిస్ ఏఐ (Miss AI)’ పోటీలను నిర్వహించారు. ఇందులో మొరాకోకు చెందిన ఇన్‌ప్లుయెన్సర్ కెంజా లాయ్‌లీ (Kenza Layli) ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఏఐ అందాల సుందరి’గా కిరీటం దక్కించుకున్నారు. ‘వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్’ పేరుతో సబ్‌స్క్రిప్షన్ ఆధారిత క్రియేటర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్యాన్‌వ్యూ’ ఈ పోటీలను నిర్వహించింది. ప్రపంచంలోనే ఈ తరహా పోటీ జరగడం ఇదే తొలిసారి. ఈ మొట్టమొదటి ‘Miss AI’ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి 1500 మంది ఏఐ మోడల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లు పోటీపడ్డారు. వీరిలో మొరాకోకు చెందిన లాయ్‌లీ ‘మిస్ ఏఐ’గా నిలవగా.. ఫ్రాన్స్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ లలీనా వలీనా రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన ట్రావెలర్ ఒలీవియా సి మూడో స్థానంలో నిలిచారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z