ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో వైద్యానికి అయ్యే ఖర్చు చూస్తుంటే ఆ మాట అక్షరాల నిజమని అనిపిస్తుంది.ఆఫీసులకు వెళ్తే పనిలో పడి కూర్చున్న చోటు నుంచి కదలకపోవడం, ఇంట్లోనేమో కొన్నిగంటల పాటు నిలబడే పనిచేయడం వల్ల అలసట వస్తుంది కానీ.. శరీరానికి కావాల్సిన వ్యాయామం దొరకడం లేదు. దాంతో ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఒక వ్యక్తి, కుటుంబానికే కాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థకు ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం(exercise)పై దృష్టి సారిస్తే మేలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. భారత్‌లో సగంమందికి పైగా వయోజనులు శారీరక శ్రమ(Physical activity)పై అసలు దృష్టి సారించడం లేదట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫారసుకు తగ్గట్టుగా వ్యాయామం కోసం కనీస సమయం కేటాయించడం లేదని లాన్సెట్ అధ్యయనం వెల్లడించిన విషయం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం.. ఏరోబిక్ యాక్టివిటీ మధ్యస్థాయిలో చేసినప్పుడు వయోజనులు ఒక వారానికి 150 నుంచి 300 నిమిషాలు వెచ్చించాల్సి ఉంటుంది. అదే ఆ శ్రమ ఎక్కువగా ఉంటే 75 నుంచి 150 నిమిషాలు కేటాయించాలని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఐదేళ్ల వయసు నుంచి అన్ని వయసుల వారికి తగ్గట్టుగా సిఫారసులు చేసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z