Movies

మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధం. నిర్మాతలుగా సోదరీమణులు.

మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధం. నిర్మాతలుగా సోదరీమణులు.

మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీకి రంగం సిద్దమైనట్లు సమాచారం. బాలకృష్ణ (Balakrishna) తన తనయుడిని 2025 లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని కోసం నటనకు సంబంధించిన శిక్షణతో పాటు పూర్తి ఫిట్నెస్ తో రెడీ అయ్యాడని టాక్‌. మోక్షజ్ఞ కొత్త లుక్ ఒకటి షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు చాలా బొద్దుగా కనపడే మోక్షజ్ఞ , ఇప్పుడు ఒక హీరోకి కావల్సిన క్వాలిటీస్ తో చాలా ఫిట్ గా రెడీ అయ్యాడు. బాలయ్య బాబు పలువురితో చర్చలు జరుపుతున్నప్పటికి ఇంకా కథ , దర్శకుడిని ఎంపిక చేయలేదట. . తమ సొంత బ్యానర్ లో కాకుండా పెద్ద బ్యానర్ ద్వారా పరిచయం చేయాలని బాలకృష్ణ ఆలోచన అని సన్నిహితులు చెబుతున్నారు. ఓ వైపు బాలయ్య కుమార్తెలు బ్రాహ్మిణి, తేజశ్విని కూడా తమ తమ్ముడు మోక్షజ్ఞ ను తమ నిర్మాణ సంస్థ ద్వారా తెరకు పరిచయం చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ అవసరం అనుకుంటే మోక్షజ్ఞ కోసం నిర్మాణ రంగంలో అడుగుపెట్టడానికి సిద్దంగా ఉన్నారంట బ్రాహ్మిణి.ఇప్పటికే బాలయ్య చిన్న కూతురు తేజశ్విని తండ్రికి సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటుంది. షూటింగ్ ల దగ్గరి నుంచి అన్ని షోల వరకు తను దగ్గరుండి చూసుకుంటుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z