DailyDose

హైదరాబాద్‌లో పోలీసుల కాల్పులు-CrimeNews-July 12 2024

హైదరాబాద్‌లో పోలీసుల కాల్పులు-CrimeNews-July 12 2024

* ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై విచార‌ణ‌ను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ జూలై 22 వాయిదా వేసింది.కోర్టులో వాద‌న‌లు సంద‌ర్భంగా.. సీబీఐ చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని క‌విత తరపు న్యాయవాది నితీష్ రాణా పేర్కొన్నారు. దీనిపై సీబీఐ న్యాయ‌వాది స్పందిస్తూ త‌ప్పులు లేవ‌ని చెప్పారు.చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జ‌డ్జి కావేరి భ‌వేజా ప్ర‌శ్నించారు. చార్జ్‌షీట్‌లో త‌ప్పులుంటే కోర్టు ఆర్డ‌ర్ ఫైల్ చేయాల‌ని తెలిపారు. అయితే కోర్టు ఆర్డర్ అప్ లోడ్ కాలేదని నితీష్ రాణా తెలిపారు.డిఫాల్ట్ బెయిల్, చార్జ్ షీట్‌పై తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలన్న నితీష్ రాణా వాదించారు. అయితే చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, కవిత డిఫాల్ట్ బెయిల్‌కు సంబందం లేదన్న సీబీఐ వాదించింది. చార్జ్‌షీట్ పూర్తిగా లేద‌ని తాము వాదించ‌డం లేద‌ని, త‌ప్పుగా ఉంద‌ని మాత్ర‌మే చెబుతున‌న‌ట్లు నితీష్ రాణా పేర్కొన్నారు.దీనికి సీబీఐ స్పందిస్తూ.. తాము సరైన పద్దతిలో చార్జ్‌షీట్‌ ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది. 60 రోజుల తరువాత డిఫెక్టివ్ చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం కవిత డిఫాల్ట్ బెయిల్ హక్కును కాలరాయడమేన‌ని క‌విత న్యాయ‌వాది ఆరోపించారు. అనంత‌రం క‌విత డిఫాల్ట్ బెయిల్‌, సీబీఐ చార్జ్‌షీట్‌నుపరిగణలోకి తీసుకునే అంశంపైనా జూలై 22న విచారణ జరువుతామని తెలిపింది.

* సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల ఘటనలు మరువకముందే నగరంలో మరో చోట పోలీసు కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్‌ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై ఒక వ్యక్తి గొడ్డలితో దాడికి యత్నించాడు. మరో వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు.దీంతో తప్పించుకునే యత్నంలో పోలీస్‌ డెకాయ్‌ టీమ్‌ కాల్పులు జరిపింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలు కాగా, మరో ఇద్దరు దుండగులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా, గత నెలలో సికింద్రాబాద్‌లోని సిటీలైట్‌ హోటల్‌ వద్ద యాంటీ స్నాచింగ్‌ టీమ్‌ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్‌ టైర్‌ను కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్‌ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయింది. తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు.

* వరంగల్‌ జిల్లాలో జంట హత్యల కేసులో నిందితుడు నాగరాజును అరెస్టు చేసినట్టు డీసీపీ రవీందర్‌ తెలిపారు. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల్‌తండాలో జరిగిన దారుణ ఘటన వివరాలను నర్సంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ వెల్లడించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి దక్కట్లేదనే హత్యలు చేశాడు. 9వ తరగతి నుంచి అమ్మాయి, ఆటో డ్రైవర్‌ మేకల నాగరాజు అలియాస్‌ బన్నీతో పరిచయం ఉంది. అమ్మాయి మేజర్‌ అయ్యాక ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.కొన్ని రోజుల తర్వాత అతనితో ఉండలేనని దీపిక (21) పుట్టింటికి వచ్చేసింది. దీపిక దక్కకపోవడానికి తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్‌ (45), సుగుణ (40) కారణమని వారిపై కక్ష పెంచుకుని నాగరాజు హత్య చేశాడు. అందరినీ చంపేద్దామనే గురువారం తెల్లవారుజామున వేట కొడవలి తీసుకొని యువతి ఇంటికి వెళ్లాడు. బయట నిద్రిస్తున్న శ్రీనివాస్, సుగుణలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తల్లిదండ్రుల కేకలు విని బయటకు వచ్చిన దీపిక, మదన్‌లాల్‌లపై కూడా దాడి చేశాడు. దాడి తర్వాత అడ్డొచ్చిన వారిని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడికి ఎవరూ సహకరించలేదు. హత్య జరిగిన తర్వాత పోలీసులు త్వరగా స్పందించారు. చట్టప్రకారం నిందితుడికి శిక్ష పడేలా చూస్తాం’’ అని డీసీపీ రవీందర్‌ తెలిపారు.

* ఆహ్లాదంగా గడుపుదామని ఫాంహౌస్‌కు వచ్చిన పలువురు ఈతకొలనులో దిగి.. ఆ నీటిలో విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ శివారు జల్‌పల్లి శివారులో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది ఆహ్లాదంగా గడిపేందుకు జల్‌పల్లిలోని ఫాంహౌస్‌కు గురువారం ఉదయం వెళ్లారు. సాయంత్రం సమయంలో ఫాంహౌస్‌లోని ఈతకొలనులోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా అవడంతో వీరంతా గాయపడ్డారు. కొలను చివరిభాగంలో ఉన్న ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు, ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. కొలను మధ్యలోనే ఉన్న పర్వేజ్‌(19), ఇంతియాజ్‌(22) రెండు నిమిషాల పాటు విద్యుదాఘాతానికి గురయ్యారు. తీవ్ర గాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఈతకొలను లోపల లైటింగ్‌ కోసం ఏర్పాటుచేసిన వైరింగ్‌ తెగిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈతకొలనులోని దీపాల వైర్ల కనెక్షన్లను లోపలి నుంచి కాకుండా బయటినుంచి ఇచ్చారు. ఈ వైరు కొలనులో తెగిపోవడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతం అయినట్లు పేర్కొన్నారు.

* తమ కుమారుడిని అకారణంగా కొట్టిన ఎస్సైపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం బోజ్యాతండా పంచాయతీ శివారు ఈదులకుంట తండాకు చెందిన మాలోతు శ్రీను-పద్మ దంపతులు డిమాండ్‌ చేశారు. స్థానిక(పాలకుర్తి) ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిని తమ కుమారుడు సురేశ్‌బాబు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినందుకు బుధవారం కక్షతో కొట్టించారని ఆరోపించారు. తండాలోని తమ( ఇంటి వద్ద గురువారం గిరిజన సంఘాల నేతల సమావేశంలో సురేశ్‌బాబు తల్లి మాట్లాడారు. తమ కుమారుడు ఒక పార్టీ విద్యార్థి విభాగం నాయకుడిగా పని చేస్తున్నాడన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఫొటోను సామాజిక మాధ్యమాల్లో కించపరిచే విధంగా పోస్టు చేశాడని కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు మేరకు తన కుమారుడిని బుధవారం తొర్రూరు ఎస్సై జగదీశ్‌ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమానాయక్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే విచక్షణారహితంగా కొడతారా అంటూ ధ్వజమెత్తారు. ఎస్సైని సస్పెండ్‌ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఘటనపై స్థానిక ఎస్సై జగదీశ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. సామాజిక మాధ్యమంలో ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేసినందుకే కేసు నమోదు చేశామన్నారు. తాము ఎవరినీ కొట్టలేదని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z