NRI-NRT

ఏలూరు జిల్లాలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసిన నాట్స్

ఏలూరు జిల్లాలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసిన నాట్స్

నాట్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తుండటం అభినందనీయమని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా వట్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నాట్స్ ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో చింతమనేని పాల్గొన్నారు. అమెరికాలో ఉంటూ ఇక్కడ తమ స్వగ్రామం మేలు కోసం తపించే భాను ప్రకాశ్ దూళిపాళ్ల లాంటి వారు నిజంగా నేటి యువతరానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తారని ప్రశంసించారు.

వట్లూరు గ్రామంలో విద్యార్ధులకు ఉపయోగపడేలా కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చొరవ చూపిన భాను ప్రకాశ్‌ని అభినందించారు. నాట్స్, గ్లో, ఏలూరు రూరల్ లయన్స్ క్లబ్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన నాట్స్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని రాధాకుమారి, చింతమనేని ప్రభాకర్‌లు ప్రారంభించారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిల సహకారంతో నాట్స్ వైస్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ ధూళిపాళ్ల వట్లూరు గ్రామంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చైతన్య సారధి డైరెక్టర్ నాగరాజు సహకారంతో ఈ కేంద్రంలో 10 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్ధులు దీనిని వినియోగించుకునేలా సిద్దం చేశారు. విద్యార్ధులకు చిన్ననాటి నుంచే సాంకేతిక అంశాలపై అవగాహన, ఆసక్తి కలిగించేందుకే ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని నాట్స్ వైస్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ ధూళిపాళ్ల అన్నారు. డాక్టర్ పూర్ణ బిక్కసాని, డాక్టర్ కొత్త శేఖరం, రాజేశ్ కాండ్రు, మురళీకృష్ణ మేడిచెర్ల, సుధీర్ మిక్కిలినేని, కిరణ్ మందాడి, రవి కిరణ్ తుమ్మల, సంకీర్త్‌కు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల తదితరులకు నాట్స్ ధన్యవాదాలు తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z