DailyDose

Telugu Horoscope – July 15 2024

Telugu Horoscope – July 15 2024

మేషం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

వృషభం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

మిథునం
మిశ్రమ కాలం. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దుర్గా ధ్యాన శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది

కర్కాటకం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అదిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం పఠించడం మంచిది.

సింహం
చిత్త శుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

కన్య
మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలు సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చంద్రశేఖరాష్టకాన్ని చదివితే మంచిది .

తుల
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతత ను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

వృశ్చికం
చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చంద్రధ్యానం మేలు చేస్తుంది.

ధనుస్సు
తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాదన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.

మకరం
శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. సకాలంలో సహాయం చేసేవారున్నారు. శివారాధన చేయడం మంచిది.

కుంభం
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఏ పనినీ సాగదీయకండి, త్వరగా పూర్తయ్యేవిధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. ఆదిత్యహృదయం పఠించడం మంచిది.

మీనం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తోటివారిని కలుపుకొని పోవాలి. ముఖ్య విషయాల్లో అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. ఈశ్వర ధ్యానం మేలు చేస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z