* ఎన్టీఆర్ జిల్లాలోని ఓ క్వారీలో ప్రమాదం జరిగింది. కంచికచర్ల మండంల పరిటాల వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ జారి డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికులపై పడింది. దీంతో బోల్డర్స్, పెద్దపెద్ద రాళ్ల కింద చిక్కుకుని ముగ్గురు కార్మికులు చనిపోయారు. మరో ముగ్గురికి ఆచూకీ లభించలేదు. వారికోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతులను జి.కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు.
* భార్యను కత్తితో గొంతు కోసి తాను కూడా అదే కత్తితో కోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. మండల కేంద్రమైన బేలకు 15 కిలోమీటర్ల దూరంలోని సయీద్పూర్ గ్రామానికి చెందిన యేసుల లక్ష్మణ్(32), సునీత పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 8, 7 సంవత్సరాల కుమారులు ఉన్నారు. కాగా, సోమవారం మద్యం మత్తులో లక్ష్మణ్ కత్తితో భార్య సునీత గొంతు కోసేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందగా తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. లక్ష్మణ్‌ను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు.
* హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన ఈ ఘటనలో రాయదుర్గం వాసి సుబ్బారావు (38) మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న ఆయన్ను ఓ వాహనం ఢీకొనడంతో ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు బైక్‌పై అల్పాహారం విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
* వీఐపీలే టార్గెట్‌గా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు పేర్కొన్నారు. సోమవారం హైదర్షాకోట్‌లో దాడులు చేశామని, ఇద్దరు నైజీరియన్లు సహా డ్రగ్స్ అమ్ముతున్న అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 పాస్‌పోర్టులు, 10 సెల్‌ఫోన్లు, 2 బైక్‌లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.డ్రగ్స్‌ను నైజీరియన్ మహిళ అనోహ బ్లెస్సింగ్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె ఫేక్ పాస్‌పోర్టుతో నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. 2019 నుంచి ఆమె డ్రగ్స్ సరాఫరా చేస్తోందని తెలిపారు. ముంబై, గోవా, బెంగళూరు ద్వారా ఆరు నెలల్లో 2.6 కిలోల కొకైన్‌ను హైదరాబాద్‌కు నైజీరియన్ మహిళా తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆరు నెలల్లో 30 మంది వీఐపీ కస్టమర్లకు కొకైన్ సరాఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్‌తోపాటు డ్రగ్స్ తీసుకున్న కిషన్ రాటి, అంకిత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్ ,హేమంత్, నిఖిల్ దావన్, మధు, రఘు కృష్ణంరాజు వెంకట్.. మరో అరుగురుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంకిత్, అమన్ ప్రీత్ సింగ్, ప్రసాద్, నిఖిల్ ధావన్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.ఇక డ్రగ్స్ సరాఫరా చేసిన అనోహా బ్లెస్సింగ్, నిజాం కాలేజీ విద్యార్థి అబీజ్ నోహం, బెంగళూరు లీడ్ కన్సల్టెన్సీ సీఈవో అల్లం సత్య వెంకట గౌతమ్, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్, సానబోయిన వరుణ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సత్య వెంకట గౌతమ్‌పై గతంలో కూడా కేసులు ఉన్నాయని చెప్పారు.డ్రగ్స్ గ్యాంగ్‌కు చెందిన కీలక సూత్రధాని ఏబుక సుజి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటున్న అయిదుగురు నుంచి శాంపిల్స్ తీసుకోగా.. అయిదుగురికి కూడా కొకైన్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. అమన్ ప్రీత్ సింగ్‌ను పరీక్షిస్తే.. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్‌ను డ్రగ్స్ వినియోగదారుడిగా పరిగణిస్తున్నామని.. పెడ్లర్‌గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదని అన్నారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ వినియోగదారుడైనా నిందితుడేనని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z