Fashion

“తాలుకా” ప్లేట్లపై ఉక్కుపాదం…బండి సీజ్ చేసి జరిమానా.

“తాలుకా” ప్లేట్లపై ఉక్కుపాదం…బండి సీజ్ చేసి జరిమానా.

రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికీ హై సెక్యూరిటీ నెంబర్‌ను మాత్రమే వేసుకోవాలని, ఫ్యాన్సీ నెంబర్లు ఉంటే అటువంటి వాహనాలపై కేసులు నమోదు చేస్తామని రవాణాశాఖ డీటీఓ జి.సి.రాజారత్నం తెలిపారు. గత వారం రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాన్సీ నెంబర్‌ ప్లేట్లు ఉన్న వాహనాల తనిఖీలు నిర్వహించి 22 కేసులు నమోదు చేసి, వారి నుంచి రు.22,700 అపరాధ రుసుం వసూలు చేసినట్లుగా ఆయన తెలియజేశారు. ఇటీవల వాహనాలకు చాలా మంది పలానా ఎమ్మెల్యే తాలూకా, మంత్రి తాలూకా అని నెంబర్‌ ప్లేటుపై రాసుకొని తిరుగుతున్నారని, తనిఖీల్లో అటువంటివి పట్టుబడితే, వాహనాలను సీజ్‌ చేసి, తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z