NRI-NRT

Australia: మెల్బోర్న్‌లో తెదేపా సంబరాలు

Australia: మెల్బోర్న్‌లో తెదేపా సంబరాలు

ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో టీడీపీ గెలుపు సంబరాలను అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సినీ నటుడు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నారై టీడీపీ తరుఫున ప్రకటించిన లక్ష ఉద్యోగ అవకాశాలను అమలుపరచాలి కోరారు. అలాగే వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కోట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. దాదాపు 1100 మంది టీడీపీ కార్యకర్తలు మరియు సానుభూతి పరులు విజయోత్సవ సంబరాలకు హాజరై సభను జయప్రదం చేశారు. తెలుదేశం మెల్ బోర్న్ కమిటీ ఆధ్వర్యంలో నా బుతో నా భవిష్యత్ అనేలా సభను నిర్వహించారు. మెల్ బోర్న్ టీడీపీ పార్టీ అధ్యక్షుడు లగడపాటి సుబ్బారావు ఆధ్వర్యంలో సభా కార్యక్రమాన్ని నిర్వహించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z