ScienceAndTech

X కేరాఫ్ ఆస్టిన్

X కేరాఫ్ ఆస్టిన్

బిలియనీర్, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంస్థలు స్పేస్‌ఎక్స్ (SpaceX), సామాజిక మాధ్యమం ఎక్స్‌(X)(ట్విటర్‌) హెడ్‌ క్వార్టర్స్‌ను కాలిఫోర్నియా (California) నుంచి టెక్సాస్‌ (Texas)కు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. కాలిఫోర్నియాలోని హతోర్న్‌లో ఉన్న స్పేస్‌ఎక్స్‌ కార్యాలయాన్ని టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌కు, ఎక్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ను కాలిఫోర్నియా నుంచి ఆస్టిన్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల జెండర్‌ గుర్తింపు మార్పుల గురించి తల్లిదండ్రులకు చెప్పకుండా టీచర్లను నిషేధించే బిల్లుపై కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ సంతకం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో చేసిన చట్టాలతో పోల్చినప్పుడు ప్రస్తుత తీసుకొచ్చిన చట్టం పరాకాష్ఠ. ఇలాంటి నిర్ణయాల వల్ల కుటుంబాలు, కంపెనీలు తమ పిల్లల రక్షణ కోసం కాలిఫోర్నియా తరలివెళతాయని గతంలోనే తాను గవర్నర్‌కు స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్నారు. టెస్లా కార్పొరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌ను మస్క్‌ 2021లో కాలిఫోర్నియా నుంచి పాలో అల్టోకు తరలించారు. తన నివాసాన్ని సైతం కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z