NRI-NRT

న్యూజెర్సీలో వై.ఎస్. జయంతి

న్యూజెర్సీలో వై.ఎస్. జయంతి

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకలకు వందలాది మంది వైఎస్సార్‌ అభిమానులు హాజరయ్యారు. మహానేత వైఎస్సార్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు. ప్రవాసులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి వైఎస్సార్‌ ఎనలేని కృషి చేశారని పలువురు ప్రశంసించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z