* ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌నకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. టోర్నీలో ఎక్కువ మ్యాచ్‌లు యూఎస్‌ఏలోనే నిర్వహించారు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూసే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జరిగింది. అయితే, టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను అమెరికాలో నిర్వహించడం వల్ల ఐసీసీ (ICC)కి రూ.167 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం. శుక్రవారం కొలంబోలో ప్రారంభం కానున్న ఐసీసీ వార్షిక సదస్సులో ఈ అంశంపై ప్రధాన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కొలంబోలో జరిగే సమావేశంలో ఐసీసీ ఛైర్మన్ పదవి విషయంపైనా చర్చించే అవకాశాలున్నాయి. బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్ పదవి రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్‌లే ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నాడు. ఆయన్ని 2025 వరకు కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. కానిపక్షంలో జై షా ఛైర్మన్ పదవిని చేపట్టే ఆస్కారముంది. ‘‘బీసీసీఐ కార్యదర్శిగా జై షా పదవీకాలం 2025లో ముగుస్తుంది. నిబంధనల ప్రకారం ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ బార్క్‌లే డిసెంబరు 2024 నుంచి డిసెంబర్ 2026 వరకు మూడో టర్మ్ కొనసాగేందుకు వీలుంది. బీసీసీఐ కార్యదర్శిగా పదవీకాలం ముగిసిన తర్వాత 2025లో జై షా ఐసీసీ పగ్గాలు అందుకుంటాడో, లేదో తెలీదు. ఐసీసీ వార్షిక సమావేశంలో జరిగే చర్చల అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది’’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
* ప్రైవేటురంగ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టెలికాం ఛార్జీలను సవరించడంతో ఇప్పుడు అందరి చూపూ ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) మీద పడింది. ఆయా టెల్కోలతో పోలిస్తే తక్కువ ధరకే నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్లాన్లు అందిస్తుండడంతో బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ తీసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెలవారీ కనీస ఛార్జీల ధరలూ పెరిగిన నేపథ్యంలో కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ కోసం ఫోన్లు వాడేవారు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్లేందుకు కనబరుస్తున్నారని అనలిస్టులు చెబుతున్నారు. జులై 3-4 తేదీల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలను సవరించిన తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్ చందాదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి నెలా సబ్‌స్క్రైబర్లు కోల్పోవడమే తప్ప కొత్తగా చేర్చుకోవడం ఇటీవల కాలంలో ఎరుగని బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇది శుభపరిణామమనే చెప్పాలి. గడిచిన రెండు వారాల్లో రెండున్నర లక్షల మంది మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా ఇతర నెట్‌వర్కుల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారినట్లు సంబంధిత వర్గాలు ఎకనమిక్ టైమ్స్‌తో పంచుకున్నాయి. మరో 25 లక్షల మంది కొత్త బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పలు చోట్ల బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డు విక్రయ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరో కొత్త మైలురాయిని చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. తర్వాత కోలుకుని భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ తొలిసారి 81 వేల మైలురాయిని అందుకోగా.. నిఫ్టీ సైతం 24,800 దాటింది. రెండు సూచీలు రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. ఇటీవల టీసీఎస్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ అంచనాలు మించి త్రైమాసిక ఫలితాలను వెలువరించడం ఆ సెక్టార్ స్టాక్స్‌లో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. దీనికి తోడు బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు కూడా సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ ఉదయం 80,514.25 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,716.55) నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు నష్టాల్లో కొనసాగిన సూచీ.. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల ఉత్సాహంతో లాభాల బాట పట్టింది. ఇంట్రాడేలో 81,522.55 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 626.91 పాయింట్ల లాభంతో 81,343.46 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 24,837.75 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 187.85 పాయింట్ల లాభంతో 24,800.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.66గా ఉంది.
* ఇ-కామర్స్ వేదికలపై ప్రత్యేక సేల్స్ హంగామా మొదలైంది. జులై 20, 21 తేదీల్లో ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ సంస్థ.. ప్రైమ్ డే సేల్‌తో (Primeday sale) ముందుకు రాగా.. వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) పేరుతో సేల్ (Flipkart GOAT sale) నిర్వహించనుంది. జులై 20 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీ, యాక్సెసరీలు, హోమ్, కిచెన్ ఉపకరణాలపై డిస్కౌంట్లు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు సూపర్ కాయిన్స్ ఆఫర్లు ఉంటాయని తెలిపింది.
* ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) మెరుగైన త్రైమాసిక ఫలితాలను (Q1 Results) ప్రకటించింది. జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.6,368 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది నమోదు చేసిన రూ.5,945 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన చూసినప్పుడు (రూ.7,969 కోట్లు) నికర లాభం 20 శాతం క్షీణించడం గమనార్హం. సమీక్షా త్రైమాసికం ఆదాయం సైతం 3.6 శాతం వృద్ధితో రూ.37,933 కోట్ల నుంచి రూ.39,315 కోట్లకు పెరిగినట్లు ఇన్ఫోసిస్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మెరుగైన తొలి త్రైమాసిక ఫలితాల ఉత్సాహంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను కూడా ఇన్ఫీ సవరించింది. స్థిర ధరల వద్ద 3-4 శాతం వృద్ధి నమోదు చేస్తామన్న విశ్వాసం వ్యక్తంచేసింది. సమగ్ర వృద్ధి, మెరుగైన ఆపరేటింగ్ మార్జిన్లు, బలమైన డీల్స్, క్యాష్ జనరేషన్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని గొప్పగా ప్రారంభించామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z