NRI-NRT

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తానా అధ్యక్షుడు నిరంజన్ భేటీ

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తానా అధ్యక్షుడు నిరంజన్ భేటీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో శుక్రవారం నాడు సమావేశమయ్యారు. తానా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, తెలంగాణాలో వీటిని మరింతగా విస్తరించే ప్రణాళికలు, రేవంత్ అమెరికా పర్యటన తదితర అంశాలపై చర్చించారు. తానా సేవల విస్తరణకు తన కార్యాలయం పూర్తి సహకారం అందజేస్తుందని రేవంత్ తెలిపారని నిరంజన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ భేటీలో తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z