Editorials

తెలంగాణా గ్రూప్ పరీక్షలు వాయిదా-NewsRoundup-July 19 2024

తెలంగాణా గ్రూప్ పరీక్షలు వాయిదా-NewsRoundup-July 19 2024

* తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది.

* వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సెమీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని తెలిపారు. అంగన్‌వాడీ ప్లేస్కూళ్ల తరహాలో మూడో తరగతి వరకు విద్యాబోధనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంగన్‌వాడీల్లో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్‌ను నియమించాలని కోరారు.

* ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ప్రధాన పరిపాలన కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసిన గేట్లను తొలగించారు. వైకాపా హయాంలో ప్రసాదరెడ్డి వీసీగా ఉన్న సమయంలో ఈ గేట్లు ఏర్పాటు చేశారు. వైస్‌ ఛాన్సలర్‌ ఛాంబర్‌కు నేరుగా ఎవరూ వెళ్లకుండా వెళ్లేందుకే ఈ గేట్లు అమర్చారు. ఏయూ ఇన్‌ఛార్జ్‌ వీసీగా శశిభూషణరావును ప్రభుత్వం గురువారం నియమించిన నేపథ్యంలో తాజాగా ఆ గేట్లను తొలగించారు.

* మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో శుక్రవారం ఉన్నపళంగా సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ కనిపిస్తోంది. దీంతో ఆయా సిస్టమ్‌లు షట్‌డౌన్‌/ రీస్టార్ట్‌ అయ్యాయి. ఇటీవల చేపట్టిన క్రౌడ్‌ స్ట్రయిక్‌ అప్‌డేట్‌ మూలంగానే ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్‌ ధ్రువీకరించింది.

* కండిషన్‌లో లేని వాహనాలు ఇచ్చారని, భద్రత తగ్గించారని మాజీ సీఎం జగన్‌, ఆయన పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. జగన్‌కు ప్రస్తుతం జడ్‌ప్లస్‌ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీసుశాఖ నిర్ధరించింది. వాహనం ఫిట్‌నెస్‌పై వైకాపా చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది.

* తెలంగాణలో గ్రూప్‌-2, 3 (ట్ఘ్ఫ్శ్ఛ్ ఘ్రౌప్ 2, 3 ఎక్షంస్) పరీక్షల వాయిదాకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ మల్లు రవి తెలిపారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో తేదీలు ప్రకటిస్తుందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

* వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ (ట్రైనీ ఈఆశ్ ఫుజ ఖెద్కర్)కు గట్టి షాక్‌ తగిలింది. ఆమె వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసిన యూపీఎస్సీ(ఊఫ్శ్ఛ్) కఠిన చర్యలకు ఉపక్రమించింది. నకిలీ పత్రాలు సమర్పించి మోసానికి పాల్పడటంపై కేసు నమోదు చేసింది.

* మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో (ంఇచ్రొసొఫ్త్ ఔతగె) సాంకేతిక సమస్య తలెత్తడంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ స్పందించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం.. మైక్రోసాఫ్ట్‌తో నిరంతరం టచ్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ సాంకేతిక సమస్యకు కారణాలను గుర్తించినట్లు ఆయన ఎక్స్‌లో వెల్లడించారు.

* గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ఏపీ సీఐడీ కూపీ లాగుతోంది. అక్రమాలు జరిగిన తీరుపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. విచారణలో భాగంగా మద్యం అక్రమాల్లో అప్పట్లో ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్ ఎండీతో పాటు, డిస్టిలరీల కమిషనర్‌గా పని చేసిన వాసుదేవ రెడ్డి పాత్రపై సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

* అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (ఝో భిదెన్) అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఆరోగ్యం, వయోభార సమస్యలనే డెమోక్రాట్లు ఇందుకు ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. అందుకుతగ్గట్టుగానే ఇటీవల బహిరంగ వేదికలపై తన వింత ప్రవర్తనతో బైడెన్‌ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. దారితప్పడం, గందరగోళ చూపులు, వేదికపై ఆగిపోవడం వంటి ఉదంతాలు అందుకు ఉదాహరణ. ఇలాంటిదే తాజాగా మరో పాత వీడియో వెలుగులోకి వచ్చింది. బైడెన్‌ ఓ మహిళను ముద్దు పెట్టుకోబోయినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇది ఎప్పటిదన్నది తెలియరానప్పటికీ.. ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కార్యక్రమంలో బైడెన్‌ సదరు మహిళతో మాట్లాడుతూ ఉన్నట్టుండి ఆమెకు దగ్గరగా వెళ్లారు. దాదాపు ముద్దు పెట్టుకోబోయే స్థితిలో కన్పించారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్‌ సతీమణి జిల్ (ఝిల్ల్ భిదెన్) దాన్ని గమనించి వెంటనే అధ్యక్షుడిని నిలువరించడం వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది మహిళను అక్కడినుంచి పంపించేశారు.

* ప్రపంచంలోనే అతిపెద్ద రీఫ్యూయలింగ్‌ పోర్టు ఉన్న సింగపుర్‌ (శింగపొరె) జలాల్లో రెండు చమురు ట్యాంకర్లలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిశాయి. ఈ ఘటనపై ఆ దేశ నౌకాయానం, పోర్టు విభాగం స్పందిస్తూ.. శుక్రవారం ఉదయం 6.15 సమీపంలో రెండు చమురు నౌకల్లో మంటలు అంటుకొన్నాయని తెలిపింది.

* దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతితో తనకు చట్టబద్ధంగా విడాకులు కాలేదని ఆమె భర్త మదన్‌మోహన్‌ తెలిపారు. గత రెండేళ్లుగా అమెరికాలో ఉన్నానని.. జనవరిలో తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఇక్కడికి వచ్చాక బాగోతం బయటపడిందన్నారు. ఐవీఎఫ్‌ ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి తెలిపినట్లు వివరించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మదన్‌మోహన్‌ మాట్లాడారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z