Fashion

బెజవాడలో నకిలీ బంగారు నాణేల ముఠా అరెస్ట్-CrimeNews-July 20 2024

బెజవాడలో నకిలీ బంగారు నాణేల ముఠా అరెస్ట్-CrimeNews-July 20 2024

* ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌ పురేందర్‌ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అతడిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ సైబరాబాద్‌ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్‌స్టేషన్ లో పిర్యాదు చేసిన మహిళతో ఇన్‌స్పెక్టర్‌ అసభ్య చాటింగ్‌ చేశాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్‌ సీపీని ఆశ్రయించింది. సీఐ చేసిన చాటింగ్‌ వివరాలను సీపీకి చూపించింది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్‌కి రావాలంటూ సీఐ ఆమెకు మెసేజ్‌లు పెట్టాడు. దీంతో సీపీ అతడిపై చర్యలు తీసుకున్నారు.

* నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠాను షాపూర్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకే గోల్డ్‌ కాయిన్స్‌ ఇస్తామని నమ్మించిన ముఠా సభ్యులు పలువురిని మోసం చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 100 నకిలీ బంగారు నాణేలు, రూ.36లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో నకిలీ బంగారు నాణేలు తయారు చేయించి.. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠా చేతిలో మోసపోయిన వారి వివరాలను షాపూర్‌ నగర్‌ పోలీసులు సేకరిస్తున్నారు.

* రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ శంషాబాద్‌, మాదాపూర్‌ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితులు నలుగురూ రాజస్థాన్‌కు చెందిన వారేనని సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి మీడియాకు వెల్లడించారు. హెరాయిన్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి.. బస్సుల్లో తీసుకొస్తున్నట్లు చెప్పారు.

* సినీ నటి, యూట్యూబర్‌ శ్రీరెడ్డిపై కర్నూలు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రులు లోకేశ్, అనితపై ఎన్నికలకు ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పలు వీడియోలను శ్రీరెడ్డి విడుదల చేశారు. శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన తెదేపా నాయకులు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z