Devotional

Horoscope in Telugu – July 23 2024

Horoscope in Telugu – July 23 2024

మేషం
పెద్దల అశీస్సులు కాపాడతాయి. బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాల కోసం వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దుర్గాధ్యానం శుభప్రదం.

వృషభం
ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

మిథునం
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

కర్కాటకం
కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ఇష్టదైవ ప్రార్థన శ్రేయస్కరం.

సింహం
కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శివనామస్మరణ శుభప్రదం.

కన్య
అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థికసాయం అందుతుంది. బంధుప్రీతి ఉంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

తుల
వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తపడాలి. ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం.

వృశ్చికం
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు. ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

ధనుస్సు
శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయంలో అనుకున్నది దక్కుతుంది. అర్థలాభం ఉంది. శ్రీలక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

మకరం
బుద్ధిబలంతో కొన్ని వ్యవహారాలలో సమస్యలను అధిగమించగలుగుతారు. మనఃస్సౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులతో కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

కుంభం
శుభ కాలం. ఏ పనులు ప్రారంభించినా త్వరగా పూర్తవుతాయి. బంధుమిత్ర సహకారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

మీనం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి,మంచి జరుగుతుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z