మేషం
శుభ సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
వృషభం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతాస్మరణ శుభకరం.
మిథునం
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి,మంచి జరుగుతుంది.
కర్కాటకం
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
సింహం
ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవడం శుభప్రదం.
కన్య
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవి ఆరాధన శుభకరం.
తుల
శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహాలు సూచితం. తోటివారిని కలుపుకొనిపోవడం ఉత్తమం. గణేశ అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల సమస్యలు తొలగుతాయి.
వృశ్చికం
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధు,మిత్రులను ఆదరిస్తారు. కానీ, వాళ్లు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. అనవసర అంశాల గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించకండి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. శ్రీలక్ష్మీ అష్టోత్తరం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు
ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.
మకరం
కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
కుంభం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ఇంట్లోని వారితో ఆనందంగా గడుపుతారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
మీనం
ఒత్తిడి వల్ల మీ మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లలితా సహస్రనామ పారాయణ శుభప్రదం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z