* కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2024-2025) పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. పర్యాటం భారత నాగరికతలో భాగమన్న ఆమె.. దేశంలోని ప్రాచీన పుణ్యక్షేత్రాలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా (world class tourist destinations) అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందన్నారు. పెట్టుబడులు కూడా విరివిగా వస్తాయని, ఇతర రంగాలు కూడా ఆర్థిక పరిపుష్టత సాధించేందుకు పర్యాటకం దోహదం చేస్తుందని చెప్పారు.
* పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఇప్పటినుంచే పొదుపు చేసేలా సరికొత్త అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈమేరకు కొత్త పింఛను విధానం (New Pension Scheme)లో మార్పులు చేసింది. పెన్షన్ పథకంలో మైనర్లనూ చేర్చేలా ‘ఎన్‌పీఎస్-వాత్సల్య (NPS-Vatsalya)’ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ (Union Budget) ప్రసంగంలో వెల్లడించారు. ఈ పథకంతో మైనర్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేర్లపైనా పెట్టుబడులు పెట్టొచ్చని నిర్మలమ్మ తెలిపారు. వారు మేజర్ అయిన తర్వాత వారి ఖాతా ఆటోమేటిక్‌గా సాధారణ ఎన్‌పీఎస్ అకౌంట్‌గా మారుతుందని పేర్కొన్నారు. దీని సాయంతో ప్లాన్ పూర్తయిన తర్వాత స్థిర ఆదాయం లభిస్తుందని తెలిపారు.
* కేంద్రబడ్జెట్-2024లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు.
* కేంద్ర బడ్జెట్ -2024లో క్యాన్సర్ ఔషధాలు, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో రిటైల్ మార్కెట్‌లో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కేంద్రం నిర్ణయంతో బంగారం, వెండి, లెదర్ వస్తువులు, సీఫుడ్ చౌకగా లభించనున్నాయి. టెలికాం పరికరాలు, అమ్మోనియం నైట్రేట్, నాన్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ వంటి వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది.
* మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) విధానాన్ని సరళీకరించడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేశారు. పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించడంతో పాటు దిగువ, మధ్యాదాయ వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా వీటిని చేపట్టినట్లు వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z