Politics

కొడాలి నాని మాజీ వ్యక్తిగత కార్యదర్శిపై దాడి-CrimeNews-July 23 2024

కొడాలి నాని మాజీ వ్యక్తిగత కార్యదర్శిపై దాడి-CrimeNews-July 23 2024

* కొన్ని రోజులుగా హాట్‌ టాపిక్‌గా మారిన బాలీవుడ్ బిగ్‌బాస్ కాంట్రవర్సీపై ‘జియో సినిమా’ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌ ప్రసారమవుతోంది. ఇందులో (Bigg Boss) ఓ జంటకు సంబంధించిన అశ్లీల దృశ్యాలను లైవ్‌లో చూపించినట్లు సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. అయితే నెట్టింట షేర్‌ అవుతోన్న ఆ వీడియో ఫేక్‌ అని జియో సినిమా స్పష్టం చేసింది. ఒరిజినల్‌ వీడియోకు మార్ఫింగ్‌ చేసి, సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారని వెల్లడించింది.

* నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు అదృశ్యం ఘటన విషాదాంతమైంది. ఆయన మృతదేహాన్ని విజయవాడలోని ఏలూరు కాలువలో లభ్యమైంది. మధురానగర్‌ రైలు పైవంతెన వద్ద ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బయటకు తీశారు. ఎంపీడీవో అదృశ్యమై 8 రోజులు దాటినా ఆచూకీ తెలియలేదు. ఈ నెల 15న ఆయన మధురానగర్‌ రైలు వంతెన పైనుంచి ఏలూరు కాలువలో దూకారు. దీనిపై గత వారం రోజులుగా ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు, పెనమలూరు పోలీసులు గాలింపు చేపట్టారు. ఏలూరు కాలువను పోలీసులు జల్లెడ పట్టారు. మధురానగర్‌ పైవంతెన పిల్లర్‌కు చిక్కుకున్న మృతదేహాన్ని గుర్తించారు. దూకిన ప్రదేశానికి కిలోమీటర్‌ దూరంలోనే లభ్యమైంది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసి ఎంపీడీవో కుమారులు, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

* హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని జెక్‌కాలనీలో ఆదివారం బాత్రూంలో తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందడానికి గ్యాస్‌ గీజరే కారణమని భావిస్తున్నారు. అందులోని విషవాయువు కార్బన్‌ మోనాక్సైడ్‌ను పీల్చినందునే ముగ్గురు మరణించి ఉంటారని వైద్యుల ప్రాథమిక నిర్ధారణలో తేలిందని సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసులు తెలిపారు. సిగ్నోడ్‌ ట్రాన్సిస్ట్‌ ప్యాకింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థలో బిజినెస్‌ హెడ్‌గా పనిచేసే ఆర్‌.వెంకటేష్‌(59), ఆయన భార్య మాధవి(52), కుమారుడు హరికృష్ణ(25).. జెక్‌ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని తమ ఫ్లాట్‌ బాత్రూంలో ఆదివారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. మానసిక స్థితి సరిగాలేని కుమారుడు హరికృష్ణకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పక్క ఫ్లాట్‌కు చెందిన వారు ఊరెళ్తుండగా.. ఈ ముగ్గురు వీడ్కోలు చెప్పారు. తర్వాత కొన్ని నిమిషాలకే కుమారుడికి స్నానం చేయించడానికి తల్లిదండ్రులిద్దరూ బాత్రూంలోకి వెళ్లి తలుపులు పెట్టారు. గీజర్‌ నుంచి విడుదలైన కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చడంతో ఆ ముగ్గురూ స్పృహతప్పి క్షణాల్లోనే మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

* కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ పీఏ ఆచంట లక్ష్మోజీపై గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం అతడు మచిలీపట్నం కలెక్టరేట్‌లో పౌరసరఫరాల విభాగం ఆర్‌ఐగా పని చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి విధులు ముగించుకుని సోమవారం రాత్రి రైలులో గుడివాడ వచ్చి స్టేషన్‌ పక్కనే సీఎస్‌ఐ చర్చి ఆవరణలో ఉన్న తన ద్విచక్ర వాహనాన్ని తీస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. తనపై దాడి చేసింది ఎవరో తనకు తెలియదని, ఎలాంటి కేసులు వద్దని లక్ష్మోజీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి ఏలూరు రోడ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. దాడి వెనకు గతంలో వైకాపాతో అంటకాగి పలు వ్యవహారాల్లో తలదూర్చినందుకా? ఇంకా ఏమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. దాడి విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు వెంటనే గుడివాడ చేరుకున్నారు. సీఎస్‌ఐ చర్చి వద్ద సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి వివరాలు సేకరించారు. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై డీఎస్పీ పి.శ్రీకాంత్, సీఐ నాగదుర్గారావులతో కలిసి చర్చించారు.

* ఆఫ్రికా దేశమైన ఇథియోపియా (Ethiopia)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి (Landslides) సుమారు 50 మంది మరణించారు. దక్షిణ ఇథియోపియా ప్రాంతీయ రాష్ట్రంలోని గోఫా జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z