NRI-NRT

మిషిగన్: సాగినాలో వైభవంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట

మిషిగన్: సాగినాలో వైభవంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట

మిషిగన్ రాష్ట్రం డెట్రాయిట్ సమీపంలోని సాయి సమాజ్‌ ఆఫ్ సాగినాలో అతిపెద్ద సాయిబాబా విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం గురుపూర్ణిమ సందర్భంగా శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. సాయిబాబా పల్లకీ సేవ, శ్రీ వేంకటేశ్వర కళ్యాణం నిర్వహించారు. ఉత్తర అమెరికాలో 7 అడుగుల అద్భుతమైన సాయిబాబా విగ్రహాన్ని కలిగి ఉన్న మొదటి సాయి దేవాలయంగా ఈ ఆలయం భాసిల్లనుంది. 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆలయ ప్రాంగణంలో 7 అడుగుల సాయిబాబా విగ్రహంతో పాటు ద్వారకామాయి, శ్రీపాద, శ్రీ వల్లభ, శనీశ్వరుడు, మహా గణపతి, దత్తాత్రేయ విగ్రహాలు ఉన్నాయి. త్వరలో దక్షిణా మూర్తి విగ్రహ ప్రతిష్ట, ధుని, నిత్య యాగశాలలు ఏర్పాటు చేస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

మూడు రోజుల ప్రాణ ప్రతిష్ట వేడుక జూలై 18న ప్రారంభమై జూలై 20న విగ్రహ ప్రతిష్ఠాపనతో ముగిసింది. నార్త్ కరోలినాలోని శంకర మఠానికి చెందిన వేద పండితులు బ్రహ్మశ్రీ మురళీకృష్ణ శర్మ భువనగిరి ఆధ్వర్యంలో సాయి సమాజ్ ప్రధాన పూజారి చిలకమర్రి వెంకట రామానుజం, షిరిడి, వాషింగ్టన్ డిసి, ఒహియో, కాన్సాస్ నుండి వచ్చిన అర్చకులు బొడ్డుచెర్ల శివశంకర ఫణి కుమార్ శర్మ, కృష్ణ చైతన్య ఓరుగంటి భార్గవ శర్మ్ మార్తి, మారుతి శర్మ మాజేటి, యువరాజ్ సులాఖె, అశోక్ బడ్డి, భాగవతుల యుగంధర్ శర్మ, కృష్ణ జన్మంచి తదితరులు ఈ క్రతువును విజయవంతంగా నిర్వహించారు.

ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. మురళి గింజుపల్లి భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 2021లో ఆలయ ప్రారంభమయిందని శ్రీనివాస్ వేమూరి, కృష్ణ జన్మంచి, హరిచరణ్ మట్టుపల్లి, డా. శ్రీధర్ గింజుపల్లి, సుజని గింజుపల్లి, స్నేహ సుంకర, నీలిమ వేమూరి, లీలా పాలుడుగు, లక్ష్మి మట్టుపల్లి, సౌజన్య హరిబాబుల సహకారంతో ఈ కల నెరవేరిందని తెలిపారు. ప్రణీత్ కోనేరు, యోగి బాబు, సాంబశివ రావ్ కొర్రపాటి, సామ్రజ్యం కొండపనేని, అనీష గోగినేని, మోనిక భుటి, రోహిణి వైద్య, విద్య తోటకూర, నందిని గౌతం తదితరులు తోడ్పాటునందించారు. నాట్యనిధి నుండి స్వాతి త్యాగరాజన్‌ చిన్నారులచే భరతనాట్యం, కళారత్న కె.వి. సత్యనారాయణ పర్యవేక్షణలో “భామా కలాపం” ప్రదర్శనలు అలరించాయి. షీల్డర్ ధోల్ తాష పాఠక్ డ్రం ప్రదర్శన, దృష్టి లోపం ఉన్న ప్రతిభావంతులైన కళాకారులచే భక్తి భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z