మేషం
ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. ద్వాదశ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నారాయణ మంత్రాన్ని జపించాలి.
వృషభం
దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
మిథునం
సర్వత్రా విజయసిద్ధి కలదు. ఊహించిన దానికంటే గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తిని ఇస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవ నామస్మరణ చేస్తే మంచిది.
కర్కాటకం
మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
సింహం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
కన్య
అత్యంత శ్రేష్ఠమైన కాలం. ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.
తుల
ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి, మంచి ఫలితాలు సొంతం అవుతాయి. అతిగా ఎవరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
వృశ్చికం
సౌభాగ్యసిద్ధి ఉంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.
ధనుస్సు
కార్యసిద్ధి ఉంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.
మకరం
కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థికలావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. దుర్గాధ్యానం శుభప్రదం.
కుంభం
జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. ఆవేశాలకు పోకూడదు. శ్రమ అధికం అవుతుంది. లింగాష్టకం చదవడం వల్ల పనులలో విజయంతో పాటు మంచి జరుగుతుంది.
మీనం
మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్ధిక పరంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యానం వల్ల మేలు జరుగుతుంది..
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z