Devotional

Horoscope in Telugu – July 27 2024

Horoscope in Telugu – July 27 2024

మేషం
స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ఇష్టదైవారాధన మేలుచేస్తుంది.

వృషభం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకం చదవాలి.

మిథునం
పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదిత్య హృదయం చదవాలి.

కర్కాటకం
మీ మీ రంగాల్లో పెద్దల నుంచి మన్ననలను పొందుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధనధాన్యవృద్ధి, సన్మానం, సుఖం, విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

సింహం
ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

కన్య
మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవాలి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక నియంత్రణ అవసరం. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

తుల
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సుసౌఖ్యం, ధైర్యం, శరీరబలం, కీర్తి, భోజన సౌఖ్యం లభిస్తాయి. శ్రీవిష్ణు ఆరాధన శుభప్రదం.

వృశ్చికం
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.

ధనుస్సు
పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.

మకరం
సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థిక యోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం.

కుంభం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ దర్శనం శ్రేయస్కరం.

మీనం
మనఃస్సౌఖ్యం ఉంది. మీ మీ రంగాల్లో మంచిపేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z