Health

$149 డాలర్లతో అమెరికా వైద్యుల సలహాలు తీసుకోవచ్చు

9 డాలర్లతో అమెరికా వైద్యుల సలహాలు తీసుకోవచ్చు

ఇప్పటివరకు కోటీశ్వరులు, సినిమా, రాజకీయ, వ్యాపార దిగ్గజాలకు పరిమితమైన విదేశీ వైద్యం నేడు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మీరు 149 డాలర్లు(సుమారు రూ.12,500) వెచ్చిస్తే చాలు.. నేరుగా అమెరికా వైద్యులే మీ ముందు ప్రత్యక్షం కానున్నారు. ఈ సేవలను ‘మై అమెరికన్‌ డాక్టర్‌’ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ఆ సంస్థ ఎండీ, సీఈవో రాజ్‌ నార్ల, సంస్థ సభ్యులు డాక్టర్‌ రాజన్‌ గార్గ్, డాక్టర్‌ డేనియల్‌ ఫ్రైడ్‌మన్, డాక్టర్‌ యోగి గండమ్‌రాజ్‌లతో కలిసి ప్రారంభించారు. టెలి మెడిసిన్‌ విధానంలో భారతీయ రోగులకు ఈ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలోని మయో క్లినిక్‌లాంటి ప్రముఖ ఆసుపత్రులకు చెందిన 50 మంది ఫిజీషియన్లు, 30 మంది సూపర్‌ స్పెషలిస్టులు ‘మై అమెరికన్‌ డాక్టర్‌’ ద్వారా ఈ గ్రూపులో అందుబాటులో ఉంటారని డాక్టర్‌ రాజ్‌ నార్ల తెలిపారు.

రోగులు కన్సల్టేషన్‌ తీసుకున్న తర్వాత 72 గంటల్లోనే వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ‘క్యాన్సర్‌ నాలుగోదశ, ఇతర క్లిష్టమైన వ్యాధుల విషయంలో రెండో అభిప్రాయం తప్పనిసరవుతుంది. ఇలాంటి సందర్భంలో ఎక్కువమంది మరింత ఆధునిక చికిత్సలు, నిపుణుల కోసం అమెరికా లాంటి దేశాల వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇలాంటివారు అమెరికా వెళ్లకుండా ఇంటినుంచే వారి సూచనలు, సలహాలు తీసుకోవచ్చు’ అని చెప్పారు. ఇప్పటికే చికిత్స పొందుతున్న వైద్యుడి సమక్షంలోనే.. మరింత మెరుగైన చికిత్స విధానాలు, సూచనలను, సలహాల కోసం అక్కడ వైద్యులతో ఆన్‌లైన్‌లో నేరుగా మాట్లాడవచ్చని వివరించారు. క్యాన్సర్‌ నుంచి న్యూరో, డెర్మటాలజీ వరకు ఇలా ఎన్నో స్పెషాలిటీ సేవలు రోగుల ముందుకు తీసుకొచ్చామని డాక్టర్‌ రాజ్‌ నార్ల వివరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z