DailyDose

Horoscope in Telugu – July 29 2024

Horoscope in Telugu – July 29 2024

మేషం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. శివారాధన చేస్తే మంచిది.

వృషభం
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుటప్పుడు బాగా అలోచించి ముందడుగు వేయండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి.

మిథునం
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి. శని,గురు శ్లోకాలు చదవడం మంచిది.

కర్కాటకం
ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

సింహం
చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత అవసరం. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. సాయిబాబా ఆరాధన శుభప్రదం.

కన్య
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో మీరు అనుకున్నది దక్కుతుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

తుల
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. దుర్గాస్తుతి చదవాలి.

వృశ్చికం
శ్రమకు తగిన ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

ధనుస్సు
మిశ్రమ వాతావరణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం శుభకరం.

మకరం
ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

కుంభం
ప్రారంభించిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

మీనం
తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎట్టకేలకు ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేయగలుగుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z