NRI-NRT

న్యూజెర్సీలో రేవంత్ సభ ఏర్పాట్లపై సమీక్ష

న్యూజెర్సీలో రేవంత్ సభ ఏర్పాట్లపై సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా 4వ తేదీన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని నిర్వాహక బృందం ఆదివారం నాడు సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించింది.

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు సమీకరించే నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుంచి 10 వరకు అమెరికా పర్యటనకు రానున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం బహుళజాతి కంపెనీల సీఈవోలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z