Movies

“రేవు” పోస్టర్ విడుదల చేసిన సంపత్ నంది-తమన్నా

“రేవు” పోస్టర్ విడుదల చేసిన సంపత్ నంది-తమన్నా

డెట్రాయిట్‌కు చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు డా. గింజుపల్లి మురళీ, పారుపల్లి నవీన్‌ల సంయుక్త నిర్మాణంలో పులి హరనాథ్ దర్శకత్వంలో రూపొందించిన “రేవు” చిత్ర రిలీజ్ పోస్టర్‌ను ప్రముఖ నటి తమన్నా, దర్శకుడు సంపత్ నందిల చేతుల మీదుగా విడుదల చేశారు. ఓదెల-2 చిత్ర షూటింగ్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆగష్టు 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

మత్స్యకారుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించేలా రూపొందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని తమన్నా ఆకాంక్షించారు. దర్శకుడు సంపత్ నంది చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z