మేషం
ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు కొనియాడతారు. అవసరాలకు డబ్బు అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.
వృషభం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. కీలక విషయాల్లో ద్వంద్వ వైఖరిని విడనాడాలి. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
మిథునం
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవిందనామాలు చదివితే బాగుంటుంది.
కర్కాటకం
మనఃస్సౌఖ్యం ఉంది. ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయకండి. మనఃశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
సింహం
విశేషమైన శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. అంతటా విజయం ఉంది. శనిధ్యానం చదవాలి.
కన్య
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.
తుల
శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి.
వృశ్చికం
మిశ్రమ కాలం.అష్టమ చంద్రదోషం వల్ల మనఃశ్శాంతి తగ్గుతుంది. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. చంద్రధ్యానం చేసుకోవాలి.
ధనుస్సు
శుభకాలం. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది.
మకరం
ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.
కుంభం
శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.
మీనం
ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మనఃస్సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z