తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం బోనాల పండుగ. తెలంగాణ అంతటా ఎంతో వైభవంగా నిర్వహించే ఈ బోనాల సంబురాలు ఖండాంతరాలు దాటాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ ‘అమ్మా బైలెల్లినాది..’ అంటూ తొట్టెలు, శివసత్తుల చిందులు, పోతరాజుల విన్యాసాలు, డప్పుల చప్పుళ్లతో బోనాల ఊరేగింపులు దద్దరిల్లాయి.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో తెలుగు ప్రవాసీయులు ‘‘న్యూజెర్సీ బోనాల జాతర’’ పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం చివరి వారం సందర్భంగా నిర్వహించే మహంకాళీ బోనాలను.. ఆదివారం న్యూజెర్సీలోని ఓం శ్రీసాయి బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్‌లో ఈ సంబురాలు కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు బోనాల జాతర కోలాహలంగా జరిగింది. దాదాపు 500కు పైగా తెలుగు కుటుంబాల వారు ఉత్సాహంగా పాల్గొనడంతో తెలంగాణా పల్లె వాతావరణం నెలకొంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z