NRI-NRT

GWTCS స్వర్ణోత్సవ వెబ్‌సైట్ ప్రారంభం

GWTCS స్వర్ణోత్సవ వెబ్‌సైట్ ప్రారంభం

బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక వెబ్‌ సైట్‌ ను ఆవిష్కరించారు. వెస్ట్‌ విండ్‌ క్రాసింగ్‌ క్లబ్‌ హౌస్‌ లో జూలై 28వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కృష్ణ లాం మాట్లాడుతూ, ఐదు దశాబ్దాల ఘన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ కమ్యూనిటీకి ఎన్నో సేవలందిస్తున్న జిడబ్ల్యుటీసిఎస్‌ స్వర్ణోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన హయాంలో ఈ స్వర్ణోత్సవ వేడుకలు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కమిటీలను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు. ప్రవాసుల సహకారంతో నిర్వహించే ఈ వేడుకలకు ప్రముఖులు ఇండియా నుంచి వస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ, సినీ, సాహిత్య, పౌరాణిక రంగానికి చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు. సినీ నటీనటులు అడవిశేష్‌, అంజలితోపాటు ఏపీ హోంమంత్రి అనిత వంగలపూడి, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌, గౌరు చరితారెడ్డి, సాహితీ వేత్తలు జొన్నవిత్తుల, రామజోగయ్యశాస్త్రి, గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు వస్తున్నారని చెప్పారు.

ఆగస్టు 3న బ్యాడ్మింటన్‌, 11న వాలీబాల్‌, త్రోబాల్‌, 24,25తేదీల్లో సాంస్కృతిక, సాహిత్య, సెప్టెంబర్‌ 2వ వారంలో క్రికెట్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు వైస్‌ ప్రెసిడెంట్‌ రవి అడుసుమిల్లి, సెక్రటరీ సుశాంత్‌ మన్నె, వైస్‌ ప్రెసిడెంట్‌ (కల్చరల్‌) సుష్మ అమృతలూరి, ట్రెజరర్‌ భానుమాగులూరి, వైస్‌ ప్రెసిడెంట్‌ (యూత్‌) శ్రీనివాస్‌ గంగ, జాయింట్‌ సెక్రటరీ విజయ్‌ అట్లూరి, సెక్రటరీ (కల్చరల్‌) శ్రీవిద్య సోమ, బోర్డ్‌ డైరెక్టర్లు చంద్ర మాలావతు, ప్రవీణ్‌ కొండాక, యష్‌ బొద్దులూరి, రాజేష్‌ కాసరనేని, ఉమాకాంత్‌ రఘుపతి, పద్మజ బేవర తదితరులు పాల్గొన్నారు.

ఎగ్జిబిట్స్‌ కమిటీ చైర్‌గా మురళీ చలసాని, స్పోర్ట్స్‌ కమిటీ చైర్‌గా సురేంద్ర ఓంకారం, వెబ్‌ అండ్‌ సోషల్‌ మీడియా చైర్‌గా యువ సిద్ధార్థ బోయపాటి, ఇనాగురల్‌ కమిటీ చైర్‌గా సాయికాంత, సావనీర్‌ కమిటీ చైర్‌గా శివ మొవ్వ, రిజిస్ట్రేషన్‌ కమిటీ చైర్‌గా రాకేశ్‌ గవర్నేని, స్టేజ్‌ అండ్‌ ఎవి కమిటీ చైర్‌గా శశాంక్‌ పడమటి, సెక్యూరిటీ కమిటీ చైర్‌గా శివాజీ మేడికొండ, రిలీజియస్‌ కమిటీ చైర్‌ గా సుబ్బు వారణాశి, ఆధ్యాత్మిక చైర్‌ గా కృష్ణ గూడిపాటి, వెన్యూ చైర్‌ గా సునీత గొట్టిముక్కల, వలంటీర్‌ కమిటీ చైర్‌గా కృష్ణ వంగవోలు ఉన్నారు. అడ్వయిజరీ టీమ్‌ చైర్మన్‌గా సతీష్‌ వేమన, అడ్వయిజర్లుగా వెంకటరావు మూల్పూరి, హరినాథ్‌ రెడ్డి, అడప ప్రసాద్‌, త్రిలోక్‌ కంతేటి, రవి గౌర్నేని, సత్యనారాయణ మన్నె, సుధ పాలడుగు, ఆపరేటింగ్‌ కమిటీ నాగ్‌ నెల్లూరి, సత్య సూరపనేని, అనిల్‌ ఉప్పలపాటి, బాబురావు సామల, విజయ్‌ గుడిసేవ, సతీష్‌ చింత ఈ కమిటీలో ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z